మంచులోయలో కాల్పుల మోత: షోపియాన్‌లో ఎన్‌కౌంటర్.. మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు
జమ్మూకశ్మీర్ మంచులోయలో కాల్పుల మోత మోగుతోంది. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రముకలకు భారత భద్రతా బలగాలు బుద్ది చెప్పినా వారు...
జమ్మూకశ్మీర్ మంచులోయలో కాల్పుల మోత మోగుతోంది. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రముకలకు భారత భద్రతా బలగాలు బుద్ది చెప్పినా వారు తీరులో మార్పు రావడం లేదు. ఇప్పటికే ఎంతో మంది ఉగ్రవాదులను ఆర్మీ జవాన్లు మట్టుబెట్టారు. శనివారం షోపియాన్ లో భద్రతా బలగాలు – ఉగ్రవాదులకు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులు మట్టుబెట్టిన భద్రతా బలగాలు.. మరో ఇద్దరిని మట్టుబెట్టాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో ఎన్ కౌంటర్ ఘటనలో భద్రతా బలగాలు భారీగా మోహరించి తనిఖీలు చేపడుతున్నారు. మరికొంత మంది ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇలా ప్రతి రోజు జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదుల ఆగడాలు మితిమీరిపోవడంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి తగిన గుణపాఠం చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్ర కదలికలు అధికంగా ఉండటంతో భారత భద్రతా బలగాలు ప్రతి రోజు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నాయి.
Vikarabad Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు – లారీ- ఆటో ఢీకొని ఏడుగురు దుర్మరణం