Ramarao On Duty: రామారావు ఆన్​డ్యూటీ నుంచి తొలి లిరికల్‌ సాంగ్‌.. మరోసారి మ్యాజిక్‌ చేసిన సిధ్‌ శ్రీరామ్‌..

Ramarao On Duty: మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్‌ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారికగా కనిపించనున్నారు. యథార్ధ సంఘటలన ఆధారంగా...

Ramarao On Duty: రామారావు ఆన్​డ్యూటీ నుంచి తొలి లిరికల్‌ సాంగ్‌.. మరోసారి మ్యాజిక్‌ చేసిన సిధ్‌ శ్రీరామ్‌..
Rama Rao On Duty
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 10, 2022 | 12:33 PM

Ramarao On Duty: మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారికగా కనిపించనున్నారు. యథార్ధ సంఘటలన ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా సినిమా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాను జూన్‌ 17న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే శ్రీరామ నవమి సందర్భంగా చిత్ర యూనిట్‌ ఆదివారం ఫ్యాన్స్‌ కోసం ఓ సర్‌ప్రైజ్‌ను ఇచ్చింది. సినిమాలోని తొలి సింగిల్‌ను విడుదల చేసింది.

‘బుల్ బుల్‌ తరంగ్‌ లోకం మోగేను.. లవబ్ డబ్ మాని నీ పేరై మోగేను..’ అంటూ సాగే ఈ పాట లిరికల్‌ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పాటలోని లిరిక్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో తన గాత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తున్న సింగర్ సిధ్‌ శ్రీరామ్‌ ఈ పాటను అలపించడం విశేషం. ఈ పాటతో సిధ్‌ శ్రీరామ్‌ మరోసారి మ్యాజిక్‌ చేశాడని చెప్పాలి. లవ్లీ మెలోడీలోని అందమైన లిరిక్స్‌ను అద్భుతంగా ఆలపించాడు.

ఇక రవితేజ, రజీషాల మధ్య వచ్చే సన్నివేశాలు బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రవితేజాకు జోడిగా దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. హీరో వేణు తొట్టెంపూడి రీఎంట్రీతో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‏గా సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సి, ఎడిటర్ గా ప్రవీణ్ కేఎల్ పని చేస్తున్నారు.

Also Read: Viral Video: నూతన వధూవరులకు విసన కర్రలు గిఫ్ట్.. ఎక్కడో తెలుసా అంటూ.. ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్..

Viral Video: పులితోనే ఆటాలా..? దాగుడు మూతలు ఆటాడిన బాతుకు షాకిచ్చిన స్మార్ట్ టైగర్.. వీడియో

groom In Wedding: పెళ్లిపీటల మీదినుంచి డైరెక్ట్ కటాకటాల్లోకి వరుడు… అసలేం జరిగిందంటే..