Bommarillu Bhaskar: సిద్దార్థ్, జెనిలీయా జంటగా తెరకెక్కిన చిత్రం ‘బొమ్మరిల్లు’. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి సినిమాతోనే ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు భాస్కర్. ఇక మొదటి సినిమా విజయవంతం కావడంతో రెండో సినిమాను మెగా హీరో అల్లు అర్జున్‌తో చేసే లక్కీ చాన్స్ కొట్టేశాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పరుగు’ కూడా మంచి ఫలితాన్నే దక్కించుకుంది. దీంతో మూడో చిత్రాన్ని రామ్ చరణ్‌తో తెరకెక్కించాడు. 2010లో వచ్చిన ఆరెంజ్ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అయితే ఈ సినిమా పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఓవైపు సినిమా వైఫల్యాన్ని మూటగట్టుకున్నా యువతను మాత్రం బాగా అట్రాక్ట్ చేసింది. ఇదిలా ఉంటే ‘పరుగు’ తర్వాత మళ్లీ మంచి విజయాన్ని అందుకోలేకపోయిన భాస్కర్ తాజాగా.. అక్కినేని వారసుడు అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం. అక్టోబర్ 8న విడుదలవుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న భాస్కర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఆరెంజ్’ చిత్రంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. ‘ఆరెంజ్ సినిమా స్క్రిప్ట్ కోసం నేను చాలా కష్టపడ్డాను, ఇప్పటికీ కొంత మంది అభిమానుల దృష్టిలో ఆరెంజ్ సినిమా ఒక కల్ట్ సినిమాగా నిలిచిపోయింది. ఆరెంజ్ సినిమా ఇప్పుడు విడుదల అయి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేదేమో. సినిమాకు సంబంధించి ఎలాంటి కామెంట్‌ను కూడా అతిశయోక్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా మెగా ఫ్యామిలీ నుంచి నాకు ఎప్పటికీ చాలా సపోర్ట్ ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. మరి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ భాస్కర్‌కు పూర్వ వైభవం తీసుకొస్తుందో చూడాలి.
Also Read: Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికోసం రూ. 5 కోట్ల ఖర్చు చేయనున్నారట..
Sreeleela: టాలీవుడ్ క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న పెళ్ళిసందడి బ్యూటీ.. స్టార్ హీరో సరసన శ్రీలీల…