Shilpa Shetty Defamation Suit: రాజ్ కుంద్రా వ్యవహారంలో శిల్పా శెట్టి వేసిన పరువు నష్టం దావాపై బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి చేసిన ప్రసారాల్లో శిల్పా శెట్టికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు తీసివేయాలని తీసివేయాలని ఆదేశించింది. ముఖ్యంగా యూపీకి చెందిన ఓ వార్తా ఛానెల్ శిల్పపై ప్రసారం చేసిన వీడియోను తొలగించాలని స్పష్టం చేసింది. కాగా, శిల్పా శెట్టి కోర్టును ఆశ్రయించిన వెంటనే.. పలు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్స్ శిల్పా శెట్టికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను తమ ఛానెళ్లు, వెబ్‌సైట్ల నుంచి తొలగించాయి. అయితే, ఈ వ్యవహారంలో శిల్పా శెట్టికి సంబంధించిన వీడియోలు గానీ, ఫోటోలు గానీ మళ్లీ అప్‌లోడ్ చేయకూడదని ఇప్పుడు కోర్టు స్పష్టం చేసింది.
పోర్న్ కేసులో శిల్పా శెట్టి భర్తను అరెస్ట్ చేయడంతో బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. కొందరు మహిళలను భయపెట్టి పోర్న్ చిత్రాలను తీసి, వాటిని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేస్తున్నట్లుగా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు పోలీసులు రాజ్‌కుంద్రాను ఈ నెల 19న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. జులై 27 వరకు పోలీసు కస్టడీలోనే ఉన్న రాజ్ కుంద్రా.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టి కావడంతో ఆమె ఫోటోలు, వీడియోనుల కూడా పలు మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నారు.
దీంతో ఇలాంటి సమాచారం ప్రచురించకుండా మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను నిరోధించాలని శిల్పా శెట్టి తన పిటిషన్‌లో హైకోర్టును కోరింది. కాగా, ముంబై హైకోర్టు ఆయా ప్లాట్‌ఫాంలను నిరోధించేందుకు నిరాకరించింది. అయితే శిల్పా శెట్టి పబ్లిక్ లైఫ్‌లో ఉన్నారని, సెలబ్రెటీ అయిన వారిపై ఇలాంటి కథనాలు ప్రచురించ కూడదని ఆమె తరుపున హాజరైన లాయర్ బిరెన్ సారాఫ్ కోర్టుకు విన్నవించాడు. ఈమేరకు కోర్టు మేం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేదా మీడియాలో ఇలాంటి కథనాలపై ఎలాంటి ప్రకటన జారీ చేయడం లేదని బదులిచ్చింది.
అంతేకాదు.. ఈ వ్యవహారంలో.. పోలీసుల నివేదిక ప్రకారం.. పరువు నష్టం కలిగించే ప్రకనటలు కావని కోర్టు అభిప్రాయపడింది. ప్రతిక స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యత హక్కు మధ్య సమతుల్యత ఉండాలని జస్టిస్ గౌతమ్ పటేల్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక వాక్ స్వాతంత్ర్యాన్ని సరైన రీతిలో వినియోగించుకోవాలని, వ్యక్తి గోప్యతకు భంగం కలిగించకూడదన్నారు. అయితే, ఒక వ్యక్తి పబ్లిక్ పర్సనాలిటీ అయితే.. ఆ వ్యక్తి తన గోప్యతా హక్కును త్యాగం చేసినట్లేనని వ్యాఖ్యానించారు.
Also read:
Baal Aadhaar card: మీ పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ చేయలేదా? అయితే అసలుకే మోసం రావొచ్చు..
Kondapalli Mining: ఆయన డైరెక్షన్‌లో గొడవలు.. కీలక విషయాలు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే..