Aryan Khan Bail: ఆర్యన్‌ బెయిల్‌ ర్యాలీలో జేబు దొంగలు.. దొరికిందే చాన్స్‌ అంటూ చేతి వాటం..

Aryan Khan Bail: డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ 28 రోజుల జైలు జీవితం తర్వాత విడుదలైన విషయం తెలిసిందే. పలుసార్లు ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ రద్దుకాగా..

Aryan Khan Bail: ఆర్యన్‌ బెయిల్‌ ర్యాలీలో జేబు దొంగలు.. దొరికిందే చాన్స్‌ అంటూ చేతి వాటం..
Aryan Khan Case

Updated on: Oct 31, 2021 | 5:45 AM

Aryan Khan Bail: డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ 28 రోజుల జైలు జీవితం తర్వాత విడుదలైన విషయం తెలిసిందే. పలుసార్లు ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ రద్దుకాగా అక్టోబర్‌ 28న ఆర్యన్‌కు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. అయితే బెయిల్‌ వచ్చిన రెండు రోజుల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. దీంతో తనయుడిని షారుఖ్‌ ఇంటికి తీసుకెళ్లారు. ఈ సమయంలోనే ఆర్యన్‌కు స్వాగతం పలికేందుకు షారుఖ్‌ అభిమానులు పెద్ద ఎత్తున మన్నత్‌కు చేరుకున్నారు. ‘వెల్‌కం ఆర్యన్‌’ అంటూ పోస్టర్లు పట్టుకొని బాణసంచా కాల్చుతూ ఫ్యాన్స్‌ సంబరాల్లో మునిగిపోయారు.

అయితే ఓ వైపు అభిమానులు అందరూ సంబరాల్లో మునిగి తేలుతుంటూ మరో వైపు దొంగలు మాత్రం తమ చేతి వాటం చూపించారు. భారీ ఎత్తున జనాలు గుమిగుడితో దొరికిందే చాన్స్‌ అన్నట్లు కొందరు మొబైల్‌ ఫోన్స్‌ను కొట్టేశారు. ఆర్తర్‌ రోడ్డులో మొత్తం 10 మొబైల్‌ ఫోన్‌లు దొంగతనానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే వీటిపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాకపోయినప్పటికీ సోసల్‌ మీడియాలో కొందరు చేసిన పోస్టులతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై జితేందర్‌ శర్మ అనే ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘షారుఖ్‌ఖాన్‌ ఇంటి బయట నా మొబైల్‌ ఫోన్‌ దొంగతనానికి గురైంది. ఒకవేళ నా ఫోన్‌ నుంచి ఏవైనా మెసేజ్‌లు, ఫోన్‌లు వస్తే దయచేసి వాటిని పట్టిచ్చుకోకండి’ అంటూ ట్వీట్ చేశారు.

ఓవైపు ఫ్యాన్స్‌ ఉత్సాహంతో సంబురాల్లో మునిగిపోతే మరోవైపు దొంగలు తమ పని తాము చేసుకున్నారన్నమాట. ఈ వార్త తెలిసిన కొందరు .. సందట్లో సడేమియా అంటే ఇదేనంటున్నారు.

Also Read: Puneeth Rajkumar Daughter: ‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె

Post Office Franchise: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ బెనిఫిట్‌..

Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైరు పేలి లారీని ఢీకొన్న కారు.. నలుగురు మృతి