
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. ప్రస్తుతం అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అని.. అందుకే కొన్ని రోజులుగా పబ్లిక్‌గా కనిపించడం లేదని తెలిపింది. అలాగే కోహ్లీతో కలిసి విరాట్ ఎక్కడికీ వెళ్లడం లేదని, కొద్ది రోజులుగా జరుగుతున్న మ్యాచ్‌లు చూసేందుకు ఆమె స్టేడియానికి రావడం లేదని సమాచారం. సన్నిహితుల సమాచారం ప్రకారం, అనుష్క, విరాట్ దంపతులు తమ రెండవ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారట. ఇక గతంలో చెప్పినట్లుగానే ఈ శుభవార్తను త్వరలోనే అభిమానులతో షేర్ చేసుకోబోతున్నారట. అయితే విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.
ప్రసుత్తం బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనుష్క, విరాట్ జంట ఇటీవల ముంబైలోని ప్రసూతి ఆసుపత్రిలో కనిపించారని.. వారి ఫోటోలను ఎక్కడా ప్రచురించవద్దని ప్రోటోగ్రాఫర్స్ కు విరాట్ హెచ్చరించినట్లుగా టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తానని.. అప్పటివరకు తమకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేయకుడదని అన్నారట.
ఇదిలా ఉంటే.. ఓ యాడ్ ద్వారా ఏర్పడిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత కొన్నాళ్లు ప్రేమలో ఉన్న అనుష్క, విరాట్ 2017 డిసెంబర్ 11న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2021లో వామిక జన్మించింది. బిడ్డ పుట్టక ముందు.. ఆ తర్వాత తమ కుమార్తె ఫోటోను షేర్ చేయలేదు. ఇప్పటికీ తమ కూతురు ముఖాన్ని చూపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుష్క ఎక్కడ టూర్‌కి వెళ్లినా, మ్యాచ్‌లు చూసినా తన కుమార్తెను ఫోటోగ్రాఫర్స్ కంటపడకుండా జాగ్రత్తలు తీసుకునేది అనుష్క. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క… పూర్తిగా ఫ్యామిలీకే సమయం కేటాయించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.