Ramyug web series: ప్రజెంట్ సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు డిజిటల్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అందుకే రామ్‌యుగ్ పేరుతో రామాయణ గాథను వెబ్ సిరీస్‌గా రూపొందించారు బాలీవుడ్ మేకర్స్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్. కంటెంట్ విషయం పక్కన పెడితే ఈ వెబ్ సిరీస్‌లో లీడ్ క్యారక్టర్స్ లుక్స్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు మనం చూస్తున్న స్టైల్ లో కాకుండా.. మోడ్రన్ హెయిర్ కట్‌తో ఉన్న రాముడ్ని, డిఫరెంట్ మేకవర్‌లో ఉన్న రావణుడిని ఆడియన్స్ అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు.
ఆ లుక్స్… టేకింగ్ కనెక్ట్ కాకపోవటంతో అసలు ఫీల్ మిస్ అయ్యిందంటున్నారు డిజిటల్ ఆడియన్స్. కంటెంట్ పరంగా మెప్పించలేకపోయినా.. క్వాలిటీ పరంగా మాత్రం గుడ్ అన్న టాకే వినిపిస్తోంది. మరి ఈ మాత్రం పాజిటివ్ టాక్‌తో రామ్‌యుగ్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ‘హమ్ తుమ్, ఫనా, తేరీ మేరీ కహానీ’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కునాల్ కోహ్లీ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసాడు. బాలీవుడ్ ద్వయం సాజిద్–వాజిద్ సంగీతం అందించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :