The Kashmir Files: వివాదంలో ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్‌.. ‘భోపాలీ’కి చెప్పిన అర్ధంపై మండిపడుతున్న ప్రజలు

The Kashmir Files: 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి( Vivek Agnihotri) వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఓ చానల్‌కు..,

The Kashmir Files: వివాదంలో ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్‌.. భోపాలీకి చెప్పిన అర్ధంపై మండిపడుతున్న ప్రజలు
Filmmaker Vivek Agnihotri

Updated on: Mar 26, 2022 | 11:49 AM

The Kashmir Files: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి( Vivek Agnihotri) వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ భోపాలీ అంటే చేసిన అర్ధం ఇప్పుడు వివాదాస్పదం అయింది. తమపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భోపాలీ ప్రజలు మండిపడుతున్నారు. భోపాలీ అంటే హోమో సెక్స్‌వల్ అని అర్ధమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తానూ భోపాల్ వాడినేనని.. కానీ, తాను ఆ విషయాన్ని ఎక్కడా చెప్పనని అన్నారు. ఎందుకంటే భోపాలీ అంటే స్వలింగసంపర్కుడని, నవాబుల ప్రవర్తన అనే అర్థాలున్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో భోపాలీ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు.

వివేక్‌ అగ్రిహోత్రి వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ.. పలువురు రాజకీయ నేతలు సహా భోపాలీ ప్రజలు, నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వివేక్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయనకు అలాంటి అనుభవం ఉందేమో కానీ భోపాల్ వాసులకు అలాంటి అలవాటు లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కౌంటరిస్తూ వివేక్‌ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: 

Hyderabad: తవ్వకాల్లో బయటపడిన పురాతన అమ్మవారి విగ్రహం.. అదృష్టం అంటూ భక్తులు ప్రత్యేక పూజలు

TS TET 2022: నేటి నుంచి టెట్ అప్లికేషన్స్ స్వీకరణ.. ఈసారి కొన్ని మార్పులు.. వారికి కూడా రాసే అవకాశం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..