Vijay Thalapathy: బాద్ షా సినిమాలో కీలకపాత్రలో దళపతి.. షారుఖ్ మూవీ కోసం విజయ్ రెమ్యునరేషన్ ఎంతంటే..

షారుఖ్, విజయ్ దళపతి మధ్య వచ్చే సీన్స్ ను సెప్టెంబర్ నెల మధ్యలో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం విజయ్ దళపతి కేవలం ఒక్క రోజు డేట్ ఇచ్చినట్లు సమాచారం.

Vijay Thalapathy: బాద్ షా సినిమాలో కీలకపాత్రలో దళపతి.. షారుఖ్ మూవీ కోసం విజయ్ రెమ్యునరేషన్ ఎంతంటే..
Thalapathy Vijay

Updated on: Jul 13, 2022 | 4:59 PM

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. తమిళ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న చిత్రం జవాన్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇక ఇందులో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతుంది. ఇందులో విజయ్ సేతుపతి మాత్రమే కాకుండా తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) కూడా అతిథి పాత్రలో కనిపించనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

షారుఖ్, విజయ్ దళపతి మధ్య వచ్చే సీన్స్ ను సెప్టెంబర్ నెల మధ్యలో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం విజయ్ దళపతి కేవలం ఒక్క రోజు డేట్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా కోసం విజయ్ దళపతి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. కేవలం తనకు డైరెక్టర్ అట్లీ, షారుఖ్ ఖాన్ తో ఉన్న స్నేహబంధం కారణంగా దర్శకుడు అడిగిన వెంటనే ఈ సినిమాలో అతిథి పాత్ర చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట దళపతి. దీంతో బాద్ షాతో దళపతి చేయనున్న సినిమా అంచనాలు పెరిగిపోయాయి. ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో సన్యా మల్హోత్రా కీలకపాత్రలో నటిస్తుండగా.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.