Tanushree Dutta: ‘నాకు ఏమైనా జరిగితే ఆయనదే బాధ్యత’.. బాలీవుడ్ నటుడిపై తనుశ్రీ దత్త సంచలన వ్యాఖ్యలు
నాకు ఏదైనా జరిగితే మీటూ నిందితుడు నానా పటేకర్, అతని బాలీవుడ్ మాఫియా స్నేహితులే కారణం. బాలీవుడ్ మాఫియా ఎవరు అనుకుంటున్నారా ?
బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్తా (Tanushree Dutta) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం నడిచినప్పుడు ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. ప్రముఖ నటుడు నానా పాటేర్ తనను తీవ్రంగా వేధించారని గతంలో ఆమె ఆరోపణలు చేసింది. ఆమె గొంతు విప్పిన తర్వాత ఇండస్ట్రీలోని పలువురు నటీమణులు సైతం తాము ఎదుర్కొన్న చేదు సంఘటనలను బయటపెట్టారు. అయితే మీటూ ఉద్యమం తర్వాత తనకు సినిమా అవకాశాలు రాకుండా వేధిస్తున్నారని ఇప్పటికే పలుమార్లు తను శ్రీ సోషల్ మీడియా వేదికగా వాపోయింది. తాజాగా ఆమె తన ఇన్ స్టాలో వివరణాత్మక పోస్ట్ చేసింది. అందులో ఆమె ఎదుర్కొంటున్న వేధింపుల గురించి మాట్లాడింది.
“నాకు ఏదైనా జరిగితే మీటూ నిందితుడు నానా పటేకర్, అతని బాలీవుడ్ మాఫియా స్నేహితులే కారణం. బాలీవుడ్ మాఫియా ఎవరు అనుకుంటున్నారా ? సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన కేసులో ఎవరెవరి పేర్లు ఎక్కువగా వినిపించాయో వాళ్లే అంటూ రాసుకొచ్చింది. బాలీవుడ్ మాఫియాను బహిష్కరించాలని.. వారి సినిమాలను ప్రజలు ఆదరించవద్దని కోరింది. దేశంలోని ప్రజలు, చట్టం, న్యాయం పై తనకు నమ్మకం ఉందని తెలిపింది. వారి సినిమాలు చూడకండి. నా గురించి విష ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టకండి. వాళ్ల సినిమాలను బహిష్కరించండి. నన్ను వేధించిన వారి జీవితాలను ప్రత్యక్ష నరకంగా మార్చండి. చట్టం, న్యాయం ముందు నేను ఒడిపోవచ్చు. కానీ దేశ ప్రజలపై నాకు నమ్మకం ఉంది. జై హింద్. బై మళ్లీ కలుద్దాం” అంటూ రాసుకొచ్చింది తను శ్రీ.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.