Vijay Devarakonda- Ananya Pandey: టాలీవుడ్ రౌడీ విజయ్‌దేవర కొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్ (Liger). ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vijay Devarakonda- Ananya Pandey: టాలీవుడ్ రౌడీ విజయ్‌దేవర కొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్ (Liger). ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతోంది చిత్రబృందం. ఓవైపు కాఫీ విత్ కరణ్ షో వంటి కార్యక్రమాల్లో ఇంటర్వ్యూలు ఇస్తూనే మరోవైపు ముంబైలో విహరిస్తూ తమ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ముంబైలోని లోకట్ ట్రైన్స్‌లో సందడి చేశారు విజయ్, అనన్య. ఇద్దరూ మ్యాచింగ్ జీన్స్ కాంబో ప్యాంట్స్ లో సరదాగా చిల్ అవుతూ ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేశారు. కాగా రైలులో వీరిద్దర్నీ ప్రయాణికులు గుర్తించి సరదాగా ముచ్చటించారు. అనంతరం అనన్య ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తూ విజయ్ కాసేపు సేదతీరారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా గురువారం సాయంత్రం బాంద్రాలోని ఓ వీధికి వెళ్లిన విజయ్, అనన్య అక్కడి స్థానిక పిల్లలతో కలిసి సరదాగా స్టెప్పులేసిన సంగతి తెలిసిందే.
— Vijay Deverakonda Trends (@VDTrendsOffl) July 29, 2022
కాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న లైగర్‌ను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై అపూర్వ మెహతా, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ మొదటిసారి ఓ భారతీయ చిత్రంలో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అలాగే సీనియర్ నటీమణి రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లకు అభిమానుల నుంచి ఊహించని స్పందన వచ్చింది.
Can’t get over how ‘at-track-tive’ these two are!?