AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swara Bhasker: కరోనా బారిన పడిన హీరోయిన్.. త్వరగా చచ్చిపో అంటూ ట్రోలింగ్స్.. ఆమె రియాక్షన్ ఏంటంటే..

దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు ఇప్పుడు గణనీయంగా పెరుగుతున్నాయి.

Swara Bhasker: కరోనా బారిన పడిన హీరోయిన్.. త్వరగా చచ్చిపో అంటూ ట్రోలింగ్స్.. ఆమె రియాక్షన్ ఏంటంటే..
Swara Bhasker
Rajitha Chanti
|

Updated on: Jan 08, 2022 | 7:33 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు ఇప్పుడు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజు రోజూకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా, ఓమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండడంతో ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలు విధిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్య్ఫూ అమలవుతుండగా.. మరికొన్ని చోట్ల పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నారు.

మరోవైపు సెలబ్రెటీలకు సైతం కరోనా ఏమాత్రం వదలడం లేదు. గత కొద్దిరోజులుగా వరుసగా సినీ ప్రముఖులు కోవిడ్ బారిన పడుతున్నారు. మహేష్ బాబు, త్రిష, సత్యరాజ్, శిల్ప శిరోద్కర్, కరీనా కపూర్ వంటి వారు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి స్వరా భాస్కర్‏కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వరా భాస్కర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది. “స్వల్ప లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకున్నాను. పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచనలతో ఐసోలేషన్లో ఉన్నాను.. ఇటీవల నన్ను కలిసిన వారు టెస్ట్ లు చేయించుకోవాలి ” అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు త్వరంగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేశారు.

View this post on Instagram

A post shared by Swara Bhasker (@reallyswara)

ఇక మరికొందరు మాత్రం స్వరా భాస్కర్‏ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ 2022లో తాము విన్న బెస్ట్ న్యూస్ ఇదే అని.. నీ మరణ వార్త కోసం ఎదురుచూస్తుంటాం. నిన్ను దేవుడు పిలుస్తున్నాడు త్వరగా వెళ్లిపో అంటూ కామెంట్స్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక తన గురించి వస్తున్న కామెంట్స్ చూసిన స్వరా భాస్కర్ వాటిని స్క్రీన్ షాట్స్ తీసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. తనను ట్రోల్ చేయడం ద్వారా కొంతమంది కడుపు నింపుకుంంటున్నారని.. నేను పోతే మీ కడుపు ఎలా నిండుతుంది. అందుకే నేను బతకాలని కోరుకోండి అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది స్వరా భాస్కర్. గతంలో సుశాంత్ సింగ్ మృతి చెందినప్పుడు అతని ప్రేయసి రియా చక్రవర్తికి మద్దతు తెలిపింది స్వరాభాస్కర్. అలాగే పలు సందర్భాల్లో స్వలింగ సంపర్కానికి మద్దతు పలకడంతో ఆమె వివాదాస్పద సెలబ్రెటీగా మారిపోయింది.

Also Read: Anupama Parameswaran : ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న కుర్రది.. అందాల అనుపమ లేటెస్ట్ ఫొటోస్..

వెన్నెల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? అందం అభినయం కలబోసిన ఈ అమ్మడు ఎవరంటే..

Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..

Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..