కొన్ని రోజుల క్రితం ‘శక్తిమాన్’నటుడు ముఖేష్ ఖన్నా నటి సోనాక్షి సిన్హా టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ‘కౌన్ బనేగా కరోపతి’ షోలో రామాయణానికి సంబంధించిన ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పలేకపోయింది. ఆఈ కారణంగా ముఖేష్ ఖన్నా సోనాక్షిని, ఆమె పెంపకాన్ని విమర్శించాడు. ఆ తర్వాత నెట్టింట ట్రోల్స్ రావడంతో తన మాటలపై విచారం వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించనని స్పష్టం చేశారు. ఈ విషయం ముగియగానే ప్రముఖ కవి కుమార్ విశ్వాస్ ఓ కార్యక్రమంలో సోనాక్షి మతాంతర వివాహంపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీంతో శతృఘ్న సిన్హా రంగంలోకి దిగారు. తన కూతురి పెళ్లిపై వస్తోన్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కుమార్ విశ్వాస్ మాట్లాడుతూ, ‘మీ పిల్లలకు సీతాజీ, ఆమె సోదరీమణుల పేర్లు, రాముడి తోబుట్టువుల పేర్లు చెప్పండి. అలాగే మీ పిల్లలను రామాయణం వినేలా చేయండి. గీతా పఠనం చేయించండి. పఠించండి. మీ ఇంటి పేరు రామాయణం. అయితే మీ ఇంటి లక్ష్మిని వేరొకరు తీసుకెళ్లారు’ అంటూ పరోక్షంగా సోనాక్షి పెళ్లిని ప్రస్తావించారు.
For your perusal, understanding & appreciation forwarding here a recent episode of statements,actions & counter reactions by/on the apple of our eye #SonakshiSinha who always has my full support, love & blessings. Must say she has handled the matter wisely, timely & very well.…
— Shatrughan Sinha (@ShatruganSinha) December 26, 2024
సోనాక్షి నటుడు జహీర్ ఇక్బాల్‌ను మతాంతర వివాహం చేసుకుంది. ఇప్పుడు దీనినే కుమార్ విశ్వాస్ టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. తాజాగా సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు. ‘మీ పరిశీలన, సమాచారం కోసం నేను కొన్ని ఇటీవలి సంఘటనలు, ప్రకటనలు, ప్రతిచర్యలలో కొంత భాగాన్ని ఇక్కడ జత చేస్తున్నాను. నా కన్మణి..నా కూతురు సోనాక్షి సిన్హాకు నా పూర్తి మద్దతు, ప్రేమ, ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నా కుమార్తె ఈ విషయాన్ని చాలా తెలివిగా పరిష్కరించుకుంటుందని తెలుసు. అలాగే నా కూతురి పెళ్లి విషయంలో రాజకీయ, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మిత్రులు ఇచ్చిన స్పందన పట్ల నేను సంతోషిస్తున్నాను. ‘ఈ విషయాన్ని సోనాక్షి, మేం పరిష్కరించాం. ఇంకేమైనా చెప్పాలా? మీ సమాచారం కోసం నేను ఇక్కడ వివిధ అంశాలను పంచుకుంటున్నాను. జై హింద్!’ అని రాసుకొచ్చారు శత్రుఘ్న సిన్హా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.