AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: జూనియర్ బాద్ షా.. తండ్రి ఫోజును అచ్చు దించేసిన అబ్‏రామ్.. పొంగిపోయిన షారుఖ్ ఖాన్..

షారుఖ్ చిన్న కుమారుడు అబ్‏రామ్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఇటీవల ఈ స్కూల్లో వార్షిక దినోత్సవం ఎంతో గ్రాండ్‏గా జరిగింది. ఈ వేడుకలో అబ్రహమ్ ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇన్నాళ్లు తండ్రితో ఎంత క్యూట్ గా కనిపించిన అబ్‏రామ్.. స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకలో మాత్రం తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా నాటకం ముగింపు సమయంలో తన తండ్రి షారుఖ్ ఖాన్ సిగ్నేచర్ ఫోజు..

Shah Rukh Khan: జూనియర్ బాద్ షా.. తండ్రి ఫోజును అచ్చు దించేసిన అబ్‏రామ్.. పొంగిపోయిన షారుఖ్ ఖాన్..
Shah Rukh Khan
Rajitha Chanti
|

Updated on: Dec 16, 2023 | 3:36 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‏కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతుంది. షారుఖ్ చిన్న కుమారుడు అబ్‏రామ్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఇటీవల ఈ స్కూల్లో వార్షిక దినోత్సవం ఎంతో గ్రాండ్‏గా జరిగింది. ఈ వేడుకలో అబ్రహమ్ ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇన్నాళ్లు తండ్రితో ఎంత క్యూట్ గా కనిపించిన అబ్‏రామ్.. స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకలో మాత్రం తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా నాటకం ముగింపు సమయంలో తన తండ్రి షారుఖ్ ఖాన్ సిగ్నేచర్ ఫోజు.. (చేతులు చాచి నిలబడడం) ప్రదర్శించి తల్లిదండ్రులతో సహా అందరినీ ఆశ్యర్యానికి గురిచేశాడు. పాతకాలపు దుస్తులను ధరించి కనిపించాడు. చివరగా.. “గివ్ మీ హగ్.. ఐ లవ్ హగ్స్” అంటూ షారుఖ్ సిగ్నేచర్ ఫోజుతో చేతులు చాచి నిల్చున్నాడు. అదే సమయంలో బ్యాగ్రౌండ్‏లో దిల్ వాలే దుల్హనియా జాయేంగే ట్యూన్ ప్లే అవుతుంది.

దీంతో అబ్‏రామ్ తోటి క్లాస్ మేట్స్ అతడిని హాగ్ చేసుకుంటూ కనిపించాడు. అయితే అబ్‏రామ్ నటన, తన సిగ్నేచర్ ఫోజు ఇవ్వడం చూసి అక్కడే ఉన్న షారుఖ్ పొంగిపోయాడు. బాద్ షా కళ్లలో పుత్రోత్సాహము కనిపిస్తుంది. ఆ వీడియోలో షారుఖ్, గౌరీ ఖాన్, సుహానా అబ్‏రామ్ ను ఉత్సాహపరుస్తూ కనిపించారు. ప్రస్తుతం అబ్‏రామ్ పర్ఫార్మెన్స్ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ఇది చూసిన నెటిజన్స్.. అతను చాలా ముద్దుగా ఉన్నాడని.. షారుఖ్ జిరాక్స్ కాపీ.. జూనియర్ బాద్ షా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

షారుఖ్, గౌరీ 2013లో సరోగసీ ద్వారా అబ్‏రామ్‏కు జన్మనిచ్చారు. అదే సమయంలో తన కొడుకు పేరు గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు షారుఖ్. అబ్‏రామ్ అనేది హజ్రత్ ఇబ్రహీం యూదు అర్థం.. అది మంచి కలయిక అని.. అందులో హిందూ దేవుడు రాముడి పేరు కూడా ఉంటుందని అన్నాడు. ఇటీవలే జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న షారుఖ్.. ఇప్పుడు డంకీ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది.

View this post on Instagram

A post shared by SRK VIBE (@_srkvibe2.0)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.