Gangubai Kathiawadi defamation case: అలియాభట్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గంగూబాయ్ కతియావాడి’ సినిమా విషయంలో ఇద్దరిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణపై మధ్యంతర స్టే విధించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అలియా భట్, చిత్రనిర్మాత సంజయ్ లీలా భన్సాలీలకు కొంచెం ఊరట లభించింది. ముంబై మాఫియా క్వీన్ ‘గంగూబాయి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తు ఈ సినిమాపై గంగూబాయి కుమారుడు బాబూజీ రాజీ షా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కారు. దీంతో గతంలో ఈ ఇద్దరికీ కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ విషయంపై ఆలియా, సంజయ్ తరపు న్యాయవాది బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆగష్టు 10 న విచారణ జరిగింది. దీంతో స్థానిక కోర్టులో జరుగుతున్న కేసు విచారణపై మధ్యంతర స్టే విధిస్తూ తదుపరి విచారణ అంటే సెప్టెంబర్ 7 వరకు జరగాలని బోంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ చిత్రం మొదట గత ఏడాది సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది అయితే అనుకోని కారణాలవల్ల వాయిదా పడింది. ఆతర్వాత కరోనా మహమ్మారి కారణంగా మరింత ఆలస్యం అయ్యింది. ఇలాంటి సమయంలో ఈ సినిమా విడుదల పై ఉత్కంఠ నెలకొంది.
ఈ సినిమాపై బాబూజీ రాజీ షా మాట్లాడుతూ.. ఈ సినిమా ది మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై నవల ఆధారంగా నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. నవలలో చెప్పిన కొన్ని విషయాలు అవమానకరంగా ఉన్నాయని, ఇవి గంగుబాయి కాథివాడి ప్రతిష్టను దిగజార్చుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై చిత్ర నిర్మాతలు, కాపీ రైటర్ హుస్సేన్ జైదీపై ఆయన ఫిర్యాదు చేశారు. ఇది మాత్రమే కాదు గంగుబాయి కఠివాడి పేరు మళ్లీ వినిపించిన తర్వాత అతని కుటుంబం ప్రజల నుంచి దూషణలు, వేధింపులను ఎదుర్కొంటోందని పేర్కొన్నాడు.