AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithin’s Maestro: నానితో పోటీకి సై అంటున్న నితిన్.. ఓటీటీలో తలపడనున్న సినిమాలు..

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయినా 'అంధాదున్'  సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ రాబోతుంది.

Nithin's Maestro: నానితో పోటీకి సై అంటున్న నితిన్.. ఓటీటీలో తలపడనున్న సినిమాలు..
Rajeev Rayala
|

Updated on: Aug 19, 2021 | 7:39 PM

Share

Nithin’s Maestro: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘అంధాదున్’  సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో నితిన్ అంధుడిగా కనిపించనున్నాడు. అలాగే హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్ నటిస్తుండగా ముఖ్య పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. ఈ సినిమా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. చాలా వరకు ఈ సినిమా షూటింగ్ కూడా జరుపుకుంది. మిగిలి ఉన్న కొద్ది భాగం చిత్రీకరణను ఇటీవలే ముగించారు టీమ్. గత కొన్నిరోజుల నుండి సినిమాను ఓటీటీలోకి విడుదలచేస్తారనే వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమచారం మేరకు ఈ సినిమాను సుమారు రూ. 32 కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ‌’వినాయకచవితి’ కానుకగా వచ్చేనెల( సెప్టెంబర్) 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు చెబుతున్నారు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, జిషు సేన్ గుప్తా ఒక కీలకమైన పాత్రను పోషించాడు. అలాగే ప్రత్యేకమైన పాత్రలో యాంకర్ శ్రీముఖి అలరించనుంది. ఇక నితిన్ ఇప్పటికే చెక్, రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాల్లో చెక్ దారుణంగా నిరాశ పరచగా. రంగ్ దే సినిమా పర్లేదనిపించుకుంది. ఇక ఇప్పుడు మాస్ట్రో  పైనే ఆశలు పెట్టుకున్నాడు ఈ కుర్రహీరో. ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పించనున్నారు. నితిన్ కెరీర్లో ఇదే పూర్తిస్థాయి ప్రయోగాత్మక చిత్రం. ఇదిలా ఉంటే నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమా కూడా ఓటీటీ వేదికగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయం పై ఇప్పటికే నాని ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కూడా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదలకానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Balakrishna: విలన్ పాత్రకోసం విలక్షణ నటుడు.. బాలయ్య కోసం బరిలోకి తమిళ్ హీరో

Sai Dharam Tej – Vaishnav Tej: మెగా బ్రదర్స్ మధ్య బాక్సాఫీస్ వార్.. వారం గ్యాప్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు..

Nayanthara : మెగాస్టార్ లూసిఫర్ రీమేక్‌లో నయనతార పాత్ర అదేనా..? క్లారిటీ వచ్చేసినట్టే.. ?

Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!