Salman Khan: సల్మాన్‌ను చంపేస్తానని బెదిరించిన యువకుడు అరెస్ట్ .. రాజస్థాన్’కు చెందిన మైనర్ యువకుడిగా గుర్తింపు

సల్మాన్ ను అంతమొందిస్తానంటూ బెదిరించిన యువకుడిని పట్టుకోవడానికి పోలీసులు చేపట్టిన ఆపరేషన్ సుమారు  తొమ్మది గంటల పాటు సాగింది. ఆ వ్యక్తిని సుమారు 10 కిలోమీటర్లు వెంబడించిన సిటీ క్రైమ్ బ్రాంచ్ మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుంది. సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి 16 ఏళ్ల బాలుడు..  తొమ్మిదవ తరగతి చదువుతూ మధ్యలో మానేసిన ఈ బాలుడు రాజస్థాన్‌కు చెందినవాడు. 

Salman Khan: సల్మాన్‌ను చంపేస్తానని బెదిరించిన యువకుడు అరెస్ట్ ..  రాజస్థాన్’కు చెందిన మైనర్ యువకుడిగా గుర్తింపు
Salman Khan

Updated on: Apr 12, 2023 | 8:54 AM

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తానంటూ బెదిరించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ ను అంతమొందిస్తానంటూ బెదిరించిన యువకుడిని పట్టుకోవడానికి పోలీసులు చేపట్టిన ఆపరేషన్ సుమారు  తొమ్మది గంటల పాటు సాగింది. ఆ వ్యక్తిని సుమారు 10 కిలోమీటర్లు వెంబడించిన సిటీ క్రైమ్ బ్రాంచ్ మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుంది. సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి 16 ఏళ్ల బాలుడు..  తొమ్మిదవ తరగతి చదువుతూ మధ్యలో మానేసిన ఈ బాలుడు రాజస్థాన్‌కు చెందినవాడు.

మరోవైపు సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా ‘కిసీ కా భాయ్, కిసీ కి జాన్’ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ వస్తున్న బెదిరింపు కాల్స్ నేపథ్యంలో సల్మాన్‌కు ముంబై పోలీసులు వై+ కేటగిరీ భద్రతను కల్పించారు.

సోమవారం రాత్రి 9.14 గంటలకు.. సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ వచ్చింది. తాను ఏప్రిల్ 30 న సల్మాన్‌ను చంపేస్తానని చెప్పాడు.  అంతేకాదు ఇదే విషయం సల్మాన్ కు చెప్పని పోలీసుని కోరాడు యువకుడు. అనంతరం కాల్‌ను డిస్‌కనెక్ట్ చేశాడు. కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే అదే నెంబర్ కు ఫోన్ చేసి.. పేరు, వివరాలను అడగగా.. తాను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన గౌ రక్షకుడు రాకీ భాయ్ అని చెప్పాడు. వాస్తవానికి సల్మాన్ ను చంపేస్తామని బెదిరిస్తూ సల్మాన్ ఖాన్ ఆఫీసు మెయిల్ ఐడికి మెసేజ్ వచ్చిన వారం రోజుల అనంతరం.. బెదిరింపు కాల్ వచ్చింది.

ఇవి కూడా చదవండి

వెంటనే స్పందించిన నగర క్రైం బ్రాంచ్‌ జాయింట్‌ సీపీ లక్ష్మీగౌతమ్‌, డీసీపీ ప్రశాంత్‌ కదమ్‌ ఆధ్వర్యంలో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. అయితే థానే జిల్లాలోని షాపూర్ లోని పద్ఘా సమీపంలో ఫోన్  లొకేషన్ చూపించింది. దీంతో ఎనిమిది మంది సభ్యుల బృందం ఆ ప్రాంతంలో తిరుగుతూనే ఉన్నారు.

మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో పోలీసులు ఒక లేన్ మూలలో వేచి ఉండగా.. ఇద్దరు యువకులు బైక్‌పై బయలుదేరారు. పోలీసులకు అనుమానం వచ్చి వారిని వెంబడించాలని అనుకుంటున్న సమయంలో వాంటెడ్ మొబైల్ ఫోన్ ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాడని సహాయక బృందం నుండి పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. “పోలీసు బృందం దాదాపు 10 కిలోమీటర్లు ఇద్దరిని వెంబడించి, చివరకు వారిని పట్టుకున్నారు. చివరికి వారిని ముంబైకి తీసుకువచ్చారు. మైనర్ బాలుడు తాను సల్మాన్ ను చంపేస్తానని ఫోన్  చేసినట్లు అంగీకరించాడు.

సుమారు 10 రోజుల క్రితం రాజస్థాన్ నుండి వచ్చి పదఘాలో తన బంధువుతో ఉంటున్నాడు. అయితే తనకు సల్మాన్ ఖాన్ గురించి కు పెద్దగా తెలియదని ఆ కుర్రాడు చెప్పాడు. ముంబై చూడాలని ఉందని, ఇమిటేషన్ జువెలరీ వర్క్ నేర్చుకున్నానని చెప్పాడు’’ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ మైనర్ బాలుడిని శిశు సంక్షేమ కమిటీలో ఉంచారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..