Sohail Khan: విడాకులు తీసుకోనున్న మరో స్టార్‌ కపుల్‌.. 24 ఏళ్ల వైవాహిక జీవితానికి వీడ్కోలు పలకనున్న సొహైల్‌ ఖాన్‌ దంపతులు..

Sohail Khan: 'సొహైల్ ఖాన్, సీమా సచ్‌దేవ్ కోర్టుకు హాజరయ్యారు. వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విడిపోయినప్పటికీ ఇద్దరూ ఒకరికొకరు స్నేహపూర్వకంగా ఉండేందుకు నిశ్చయించుకున్నారు' అని న్యాయస్థానం పేర్కొంది.

Sohail Khan: విడాకులు తీసుకోనున్న మరో స్టార్‌ కపుల్‌.. 24 ఏళ్ల వైవాహిక జీవితానికి వీడ్కోలు పలకనున్న సొహైల్‌ ఖాన్‌ దంపతులు..
Sohail Khan

Updated on: May 13, 2022 | 7:36 PM

Sohail Khan: సినిమా ఇండస్ట్రీలో మరొక జంట విడాకులు తీసుకోనుంది. సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్‌ (Sohail Khan) తన సతీమణి సీమాఖాన్‌ (Seema Khan)తో విడాకులు తీసుకోనున్నారు. తమ 24 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఇద్దరూ ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోర్టు పరిసర ప్రాంతాల్లో వీరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. న్యాయస్థానం కూడా వీరి విడాకుల విషయంపై స్పందించింది. ‘సొహైల్ ఖాన్, సీమా సచ్‌దేవ్ కోర్టుకు హాజరయ్యారు. వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విడిపోయినప్పటికీ ఇద్దరూ ఒకరికొకరు స్నేహపూర్వకంగా ఉండేందుకు నిశ్చయించుకున్నారు’ అని న్యాయస్థానం పేర్కొంది.

ప్రేమ వివాహం చేసుకుని..

ముగ్గురు ఖాన్‌లలో చిన్నవాడైన సొహైల్ నటుడిగా మారడానికి ముందే దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఆతర్వాత ప్రొడ్యూసర్‌గా, రైటర్‌గానూ సత్తాచాటారు. ఈక్రమంలోనే ప్యార్ కియా తో డర్నా క్యా చిత్రం షూటింగ్‌లోనే సీమా సచ్‌దేవ్‌ను కలిశాడు. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డారు. 1988లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి నిర్వాన్‌, యోహాన్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా 2017లోనే వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారు అని వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే సీమా వాటిని ఖండించింది. ఏ బంధంలో అయినా మనస్పర్థలు సహజమని, తమకు అన్నింటి కంటే తమ పిల్లలే చాలా ముఖ్యమని పేర్కొంది. అయితే ఇప్పుడు వీరు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Accident: దైవ దర్శనానికి వెళుతుండగా ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు, ముగ్గురు మృతి..

Jammu and Kashmir: ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు.. కశ్మీరీ పండిట్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం..

JC Prbhakar Reddy: జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మారూరు టోల్‌గేట్‌ వ‌ద్ద ఉద్రిక్తత..