
సల్మాన్ ఖాన్ సినిమా అంటే ఊర మాస్ గా ఉండాలి. భారీ యాక్షన్ సీక్వెన్సులు, పంచ్ డైలాగ్‌లు ఉండాలి. సల్లూ అభిమానులు ఎక్కువగా ఇవే కోరుకుంటారు. ఇప్పుడు అలాంటి అంచనాలన్నింటినీ అందుకునేలా ‘సికందర్’ సినిమా టీజర్ గురువారం (ఫిబ్రవరి 27) విడుదలైంది. ఇందులో సల్మాన్ ఖాన్ ఊర మాస్ అవతారంతో కనిపించాడు. ఎప్పటిలాగే పోరాట సన్నివేశాల్లో అద్దరగొట్టాడు. ఎ.ఆర్. మురుగదాస్ ‘సికందర్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాజిద్ నదియా వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా సల్లూ అభిమానులకు ఒక చిన్న సర్ ప్రైజ్ ఇస్తూ సికందర్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్‌ను పెద్ద తెరపై చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సికిందర్ టీజర్ అంచనాలను పెంచేసింది. మురుగదాస్ గతంలో ‘గజిని’, ‘స్టాలిన్’, ‘తుపాకి’, ‘కత్తి’, ‘స్పైడర్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక హిందీలో అమీర్ ఖాన్ తో ‘గజినీ’, అక్షయ్ కుమార్ తో ‘హాలిడే’, సోనాక్షి సిన్హాతో ‘అకీరా’, సల్మాన్ ఖాన్ తో ‘జయహో’ చిత్రాలను తెరకెక్కించారు. ఇక సల్మాన్‌ఖాన్‌తో మురుగదాస్ జత కట్టడం ఇది రెండో సారి.
‘సికందర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన రష్మిక మందన్న నటించింది. ‘యానిమల్’ పుష్ప2. ‘ఛావా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో రష్మిక మందన్న ఇప్పటికే బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు ‘సికందర్’ తో రష్మిక మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకునే అవకాశం దక్కింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ‘నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ ప్రస్తుతానికి వెల్లడి కాలేదు.
Jo dilon par karta hai raj woh aaj kehlata hai Sikandar
https://t.co/Bn5NdtKN2z #SajidNadiadwala’s #Sikandar
Directed by @ARMurugadoss@iamRashmika #Sathyaraj @TheSharmanJoshi @MsKajalAggarwal @prateikbabbar #AnjiniDhawan @jatinsarna #AyanKhan @DOP_Tirru…
— Salman Khan (@BeingSalmanKhan) February 27, 2025
కాగా సికందర్ 2 తర్వాత ‘కిక్ 2’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు సల్మాన్. అలాగే అట్లీతో కూడా ఓ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.