సాధారణంగా సినిమాలు గురువారం లేదా శుక్రవారం థియేటర్లలో రిలీజవుతుంటాయి. అయితే సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ చిత్రం మాత్రం ఆదివారం విడుదల కానుంది. అవును.. ఉగాది, రంజాన్ పండగలను పురస్కరించుకుని మార్చి 30 న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం సల్మాన్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండా విడుదలవుతుండడం గమనార్హం. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ప్రక్రియ శుక్రవారం (మార్చి 21)తో పూర్తయింది. థియేటర్లలో విడుదల కానున్న ఈ ట్రైలర్ నిడివి 3 నిమిషాల 38 సెకన్లు. ఇక సినిమా నిడివి 150.8 నిమిషాలు. అంటే 2 గంటల 30 నిమిషాల పాటు మూవీ ఉంటుంది. ఇక సికందర్ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది, అంటే 13 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు దీనిని చూడవచ్చు.
కాగా ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. దీంతో అభిమానుల ఆశలన్నీ సికందర్ పైనే ఉన్నాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. దీని ద్వారా, సల్మాన్ ఖాన్ వారిని తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ‘సికందర్’ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ రష్మిక మందన్నా. ఇటీవల ఆమె నటించిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. . ఇప్పుడు, ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని రష్మిక అభిమానులు కోరుకుంటున్నారు. ఏఆర్ మురుగదాస్ గతంలో ‘గజిని’ సినిమా తీశారు. అది హిట్ అయింది. అలాగే ‘కత్తి’, ‘తుపాకి’, ‘సర్కార్’, ‘దర్బార్’ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అందుకే ఈ సికందర్ సినిమాపై సల్మాన్ అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ సన్నిహితుడు సాజిద్ నదియావాలా నిర్మించారు.
Latest: Full-fledged advance booking for #Sikandar will open on 25th March!!!
Trailer out today, and the movie is set to release on 30th March!@BeingSalmanKhan #SalmanKhan @NGEMovies @ARMurugadoss @iamRashmika @MsKajalAggarwal pic.twitter.com/ZuUjfR4gVo
— SALMAN KI SENA™ (@Salman_ki_sena) March 23, 2025
See you in theatres worldwide on 30th March! #Sikandar #SajidNadiadwala’s #Sikandar
Directed by @ARMurugadoss @iamRashmika #Sathyaraj @TheSharmanJoshi @MsKajalAggarwal @prateikbabbar #AnjiniDhawan @jatinsarna #AyanKhan @DOP_Tirru @ipritamofficial @Music_Santhosh… pic.twitter.com/IeiEAIUEiw— Salman Khan (@BeingSalmanKhan) March 19, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.