బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) మళ్లీ చిక్కుల్లో పడ్డాడు.. 2019లో ఓ జర్నలిస్ట్‌ను బెదిరించడం.. అవమానించడంపై సల్మాన్‌తోపాటు.. అతని బాడీగార్డ్ నవాజ్ షేక్‌లకు ముంబైలోని అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. వీరిద్ధరి ఏప్రిల్ 5న తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. అతని బాడీగార్డ్ మహమ్మద్ నవాజ్ ఇక్బార్ షేక్ పై సెక్షన్ 504 (శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశ్యపూర్వకంగా బెదిరించడం.. ) 506 (నేరపూరిత బెదిరింపు ) నేరాల కింద్ కేసు నమోదు చేశారు. హీరో సల్మాన్‌తోపాటు.. అతని బాడీగార్డ్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ అశోక్ పాండే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అసలు విషయానికి వస్తే.. 2019 ఏప్రిల్ 24న ఉదయం సల్మాన్ ముంబైలోని ఓ వీధిలో సైకిల్ తొక్కారు. అదే సమయంలో జర్నలిస్ట్ అశోక్ పాండే.. సల్మాన్ బాడీగార్డ్ అనుమతి తీసుకుని అతడిని ఫోటోస్..వీడియోస్ తీయడం ప్రారంభించాడు.. దీంతో సల్మాన్ కొపగించుకుని.. తన బాడీగార్డ్‌తో తనను కొట్టించారని.. ఆ తర్నాత తన ఫోన్ లాక్కొని బెదిరించారని జర్నిలిస్ట్ అశోక్ పాండే ఆరోపించారు. ఇదే విషయం పోలీసులకు తెలిపేందుకు తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని.. కోవిడ్ కారణంగా ఇన్ని రోజులు ఆలస్యమైందని.. చివరకు కోర్టు.. సల్మాన్.. అతని బాడీగార్డ్ పై చర్యలు తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు అశోక్ పాండే.
Also Read: Ram Gopal Varma : బాలీవుడ్‌ను తన స్టైల్‌లో కడిగిపారేసిన ఆర్జీవీ.. కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్
Harish Shankar: బంపర్ ఆఫర్ అందుకున్న హరీష్ శంకర్.. మెగాస్టార్‌తో ఆ మూవీ రీమేక్
RRR Movie: రేటు ఎంతయినా తగ్గేదే లే.. ఆర్ఆర్ఆర్ టికెట్ల కోసం పోటీపడుతున్న ఫ్యాన్స్ .