Raveena tandon: స్టూడియోలో వాంతులు చేసుకున్న ప్రదేశాన్ని క్లీన్ చేశాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన కేజీఎఫ్ బ్యూటీ..

|

Apr 23, 2022 | 6:16 PM

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో కేజీఎఫ్ 2 (KGF 2) హహా కొనసాగుతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

Raveena tandon: స్టూడియోలో వాంతులు చేసుకున్న ప్రదేశాన్ని క్లీన్ చేశాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన కేజీఎఫ్ బ్యూటీ..
Raveena Tandon
Follow us on

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో కేజీఎఫ్ 2 (KGF 2) హహా కొనసాగుతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. హీరో యశ్ మాత్రమే కాకుండా.. కేజీఎఫ్ 2 మూవీలోని ప్రతి ఒక్క నటీనటులు ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్.. ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి ప్రస్తుతం కేజీఎఫ్ 2 విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఈ మూవీతో మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యింది బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో చిత్రయూనిట్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ బిజీగా ఉన్నారు. తాజాగా రవీనా టాండన్ మిడ్ డే కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి.. తాను నటిగా మారిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది. కెరీర్ ప్రారంభంలో తాను స్టూడియోలో పనిచేసేదాన్ని అని.. అక్కడ ఫ్లోర్స్ శుభ్రం చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది..

రవీనా టాండన్ మాట్లాడుతూ.. “స్టూడియోలో క్లీనింగ్ వర్క్ చేస్తూ కెరీర్ ప్రారంభించిన మాట వాస్తవమే.. బాత్రూమ్స్, స్టూడియో ఫ్లోర్ శుభ్రం చేసేదాన్ని. అంతేకాకుండా.. ఎవరైనా వాంతులు చేసుకున్న ప్రదేశాన్ని కూడా శుభ్రం చేసేదాన్ని. పదవ తరగతి పూర్తి చేసిన తర్వాత నేను స్టూడియోలో పనిచేయడం ప్రారంభించారు. అప్పుడు అక్కడున్న వారందరూ నన్ను చూసి.. నువ్వు కెమెరా ముందు ఉండాలి.. స్క్రీన్ వెనక కాదు అని చెప్పేవారు. నేనా.. నటిగా మారడమా ? అసలు ఛాన్స్ లేదు అనుకునేదాన్ని. కానీ అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను.. నేనెప్పుడు నటిని అవుతానని అనుకోలేదు… ప్రహ్లాద్ సెట్‏లో మోడల్ రానప్పుడు.. నేను మోడల్ గా ఫోజులిచ్చాను.. ప్రహ్లాద్ దగ్గర ఫ్రీగా ఇలా మోడల్ గా ఎందుకు చేయాలని అనుకున్నాను.. దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు కాదా అని అనుకున్నాను.. అలా మోడల్ గా మారాను.. అలా నెమ్మదిగా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాను.. దీంతో నాకు సినిమా ఛాన్సులు వచ్చాయి.. కానీ ఆ సమయంలో నాకు నటన రాదు.. కానీ అన్ని నేర్చుకున్నాను. ” అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Jeevitha Rajasekhar: తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఉంది.. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..

Singer Sunitha: గుడ్ న్యూస్ షేర్ చేసిన సింగర్ సునీత.. Blessed అంటూ..

S Janaki Birthday: ఐదుతరాల హీరోయిన్లకు ఆలంబన జానకమ్మ స్వరం.. గానకోకిల పుట్టిన రోజు నేడు..

Viral Photo: ఇంద్రలోకంలో అలిగినట్లుంది.. భువిపైకి వచ్చింది ఈ సుకుమారి.. ఎవరో గుర్తించారా..?