
ప్రస్తుతం సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో రష్మికకు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలతో అలరించింది. కానీ ఈ సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. దీంతో ఇప్పుడు రష్మిక ఆశలన్ని యానిమల్ చిత్రంపైనే ఉన్నాయి. ఈ మూవీకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన రణబీర్ ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై అంచనాలు పెంచేసింది. ఇక ఇటీవల విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ గురించి చెప్పక్కర్లేదు. మెడలో తాలిబొట్టు.. పట్టు చీరలో మరాఠీ గృహిణీగా ఆకట్టుకుంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు. సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పై రోజు రోజుకీ పాజిటివ్ బజ్ పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ మూవీ కోసం నటీనటుల రెమ్యునరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Dil Raju acquires Sandeep Reddy Vanga’s AP/TS theatrical rights for a whopping amount of ₹15 cr.
It is being said that #DilRaju watched some rushes of #Animal and was impressed very much with #SandeepReddyVanga’s taking and #RanbirKapoor‘s performance.
Hence he bought the… pic.twitter.com/IxQNnTLx3r
— Manobala Vijayabalan (@ManobalaV) September 26, 2023
రణబీర్ కపూర్ చివరిసారిగా ఝూతి మైన మక్కార్ చిత్రంలో నటించారు. ఈ సినిమాకు అతను దాదాపు రూ25 నుంచి 30 కోట్ల వరకు తీసుకున్నారు. ఇప్పుడు తన పారితోషికాన్ని దాదాపు మూడు రెట్లు పెంచినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం ఈ సినిమా కోసం మొత్తం రూ.70 కోట్లు భారీ మొత్తాన్ని తీసుకున్నట్లుగా సమాచారం.
ఇక రష్మిక విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం రూ.4 కోట్లు పారితోషికం తీసుకుందని తెలుస్తోంది. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఆమె ఒకరు. ముందుగా ఈ సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రానికి డిసెంబర్ 1కి వాయిదా పడింది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.