
బాలీవుడ్ లో రీసెంట్ గా ఓ సినిమా దూమురేపుతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తుంది ధురంధర్. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు పలు దేశాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేసినప్పటికీ.. ఇటు భారతదేశంలో మాత్రం సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన మారుమోగుతున్న పేరు ధురంధర్. ఇందులో రణవీర్ సింగ్, సారా అర్జున్ జంటగా నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమా రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ దూసుకుపోతుంది ఈ సినిమా.. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తక్కువ రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును దాటింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తోన్న ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా రికార్డు ధర పలికాయని తెలుస్తుంది. ‘ధురంధర్’ డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మొదట రూ.130 కోట్లకు ఒప్పందం కుదిరిందని ప్రచారం జరగగా, తాజా సమాచారం ప్రకారం ఈ మొత్తం ఏకంగా రూ.285 కోట్ల వరకు వెళ్లిందని ప్రచారం జరుగుతుంది. ‘ధురంధర్’ రెండవ భాగం కూడా కొత్త సంవత్సరం మార్చి నెలలో విడుదల కానుంది.
ఈ రెండు భాగాల హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ‘ధురంధర్ పార్ట్ 1′ కి నెట్‌ఫ్లిక్స్ పార్ట్ 1, పార్ట్ 2’ కి కలిపి చెల్లించిందని టాక్. రణ్‌వీర్ సింగ్ కీలక పాత్రలో నటించగా, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం 8 వారాల గ్యాప్ ఇచ్చేలా ఒప్పందం కుదిరిందట. అందువల్ల వచ్చే జనవరి 30 తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.