83 Movie Release: కపిల్‌ దేవ్‌ జీవిత చరిత్ర.. 83 మూవీ.. విడుదల ఎప్పుడంటే..?

|

Sep 26, 2021 | 6:27 PM

83 Movie Release Date: 83 సినిమా కోసం రణవీర్ సింగ్, కపిల్‌ దేవ్‌ అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గత ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో

83 Movie Release: కపిల్‌ దేవ్‌ జీవిత చరిత్ర.. 83 మూవీ.. విడుదల ఎప్పుడంటే..?
83 Release Date
Follow us on

83 Movie Release Date: 83 సినిమా కోసం రణవీర్ సింగ్, కపిల్‌ దేవ్‌ అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గత ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. 83 సినిమా భారత క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర. ఇప్పుడు మహారాష్ట్రలో సినిమా హాళ్లు ప్రారంభం కావడంతో చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. అక్టోబర్ 22 నుంచి మహారాష్ట్రలో థియేటర్లు ప్రారంభం కానున్నాయి. దీంతో అనేక చిత్రాల విడుదల తేదీలు ప్రకటించారు. ఈ రోజు రణ్‌వీర్ సింగ్‌ సోషల్ మీడియాలో క్రిస్మస్ సందర్భంగా 83 మూవీని విడుదల చేస్తామని పోస్ట్‌ చేశారు.

అంతేకాదు పోస్ట్‌పై ఇలా రాశారు.. వరల్డ్‌ కప్ సందర్బంగా 83 సినిమా క్రిస్మస్‌కి థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో విడుదల అవుతోందని అన్నారు. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే దీపిక, రణ్‌వీర్ మొదటిసారి కలిసి నటించారు. రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో కనిపిస్తుండగా దీపిక అతని భార్య రోమి పాత్రలో కనిపించనుంది. టీమిండియా వెస్టిండీస్‌ని ఓడించి ప్రపంచకప్ గెలిచిన కథను ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులు మరోసారి అద్భుత క్షణాలను గుర్తుచేసుకునే అవకాశం దక్కుతోంది.

జూన్‌లో విడుదల చేయాల్సి ఉంది
కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన 83 చిత్రం కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది వాయిదా పడింది. ఈ చిత్రాన్ని జూన్ 2021 లో విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ లాక్డౌన్ కారణంగా వాయిదా వేయవలసి వచ్చింది. ఇప్పుడు చివరకు ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. 83 లో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే, పంకజ్ త్రిపాఠి, బొమన్ ఇరానీ, సకీబ్ సలీమ్, హార్డీ సంధు, తాహిర్ రాజ్ భాసిన్, జతిన్ సర్నా, అమీ విర్క్‌తో సహా పలువురు నటులు ప్రధాన పాత్రల్లో నటించారు.

Bank Rules: ఆటో డెబిట్ ఆప్షన్ లో బిల్లులు చెల్లిస్తున్నారా? అయితే త్వరలో రాబోతున్న ఈ పెద్ద మార్పు గురించి తెలుసుకోండి..

Bigg Boss 5 Telugu: షణ్ను నోటి దూల తీర్చిన నాగ్..! | అందర్నీ ఉతికిపారేసిన పవన్‌..(లైవ్ వీడియో)

Boat Capsize: ఘోర ప్రమాదం.. నదిలో పడవ బోల్తా.. 22 మంది గల్లంతు.. ఆరు మృతదేహాలు లభ్యం..