Priyanka Chopra: ‘బాలీవుడ్‌లో వారిదే ఆధిపత్యం’.. బీటౌన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన గ్లోబల్ స్టార్..

విభిన్న కథలను ప్రేక్షకులు స్వాగతించడమే కాకుండా .. చిత్ర పరిశ్రమను ప్రజాస్వామ్యం చేసేందుకు ప్రజలు ఓటీటీ సంస్థలను కూడా స్వీకరించాలని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అన్నారు.

Priyanka Chopra: బాలీవుడ్‌లో వారిదే ఆధిపత్యం.. బీటౌన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన గ్లోబల్ స్టార్..
Priyanka Chopra

Updated on: Jun 23, 2021 | 1:06 PM

విభిన్న కథలను ప్రేక్షకులు స్వాగతించడమే కాకుండా.. చిత్ర పరిశ్రమను ప్రజాస్వామ్యం చేసేందుకు ప్రజలు ఓటీటీ సంస్థలను కూడా స్వీకరించాలని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అన్నారు. తాను నటించిన ది వైట్ టైగర్ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. స్ట్రీమింగ్ సేవలు నటీనటులను బాలీవుడ్ సినీ పరిశ్రమలో నిబంధనల గురించి ఆలోచించేలా చేశాయి అన్నారు.

స్ట్రీమింగ్ సేవల స్వేచ్చ .. ఇప్పుడు చాలా మందిలో ఉన్న టాలెంట్ బయటకు తీసేందుకు ఉపయోగపడుతుంది. సాదారణంగా సినిమా అంటే… నాలుగు పాటలు.. యాక్షన్ సీన్స్ ఉండాలి. ఇదే పార్ములా బాలీవుడ్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు అది పోయింది. ప్రజలకు మంచి.. నిజమైన కథలను చెప్పేందుకు సమయం వచ్చిందని ప్రియాంక చోప్రా అన్నారు. మంగళవారం సాయంత్రం యుఎస్‌లో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జెడ్‌ఇ 5 ప్రారంభించిన వర్చువల్ విలేకరుల సమావేశంలో చోప్రా జోనాస్ మాట్లాడారు. ZEE5 గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అర్చన ఆనంద్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‏లో ఓటీటీ సంస్థల పనితీరు.. బాలీవుడ్ లో ఎన్నో సంవత్సరాల నుంచి గుత్తాధిపత్యాన్ని విచ్చిన్నం చేసిందని.. ఫలితంగా కొత్త కథాంశాలు వస్తున్నాయన్నారు.

చాలా మంది కొత్త రచయితలు, నటీనటులు, చిత్రనిర్మాతలకు బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి రావడానికి ఓటీటీ సంస్థలు అవకాశాలు కల్పించాయని చెప్పారు. అయితే థియేటర్లలో సినిమా చూసిన ఫీల్ ఎప్పటికీ రాదని.. కాని.. ఓటీటీ సంస్థలకు కూడా ప్రేక్షకులకు థియేటర్ అనుభూతిని కలిగిస్తున్నాయన్నారు. ఓటీటీ సంస్థల వలన చిత్రాలు ఎక్కడైన చూసే వీలు కల్పించడమే కాకుండా.. వినోదం. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కించడానికి ఓటీటీ సహయపడుతుందని చెప్పారు.

Also Read : Mysterious Lights: మరోసారి తెరపైకి ఏలియన్స్ చర్చ.. గుజరాత్‏లో మిస్టరీగా మారిన ఆకాశంలో వింత కాంతి.. నిపుణులు ఏమంటున్నారంటే..

Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!