బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక. దాదాపు స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రియాంక.. ఆ తర్వాత హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ.. గ్లోబల్ స్టార్‌గా మారింది.
ఇక అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత.. ప్రియాంక.. బాలీవుడ్లో సినిమాలు చేయడం తగ్గించింది ప్రియాంక. ప్రస్తుతం తన భర్తతో కలిసి లాస్ ఏంజెస్లో నివాసముంటున్న ప్రియాంక.. హాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తుంది. ఇక ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాల్లో తన భర్త నిక్ పేరు తొలగించడంతో వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ రూమర్స్ నిజం కావంటూ ప్రియాక తెల్చి చెప్పింది.
ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం ప్రియాంక తన భర్త నిక్ జోనాస్‌ను హీరోగా పరిచయం చేయాలని చూస్తుందట. తనకు ఉన్న బ్యాగ్రౌండ్‌తో నిక్ జోనాస్ ను పెద్ద బ్యానర్లో ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో హీరోగా పరిచయం చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్. ఇక ఇటీవలే టాలీవుడ్ చందమామ కాజల్ కూడా తన భర్త గౌతమ్ కిచ్లును హీరోగా పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా టాక్.
Also Read: Skylab Movie: స్కైలాబ్ భూమ్మీద పడుతుందని ఊరంతా లొల్లి లొల్లి… ఆకట్టుకుంటోన్న నయా టీజర్..
Unstoppable with NBK: బాలయ్య షోకు గెస్ట్ గా ఆ స్టార్ హీరో రానున్నాడా.. నిజమైతే ఫ్యాన్స్ కు పూనకాలే..
Acharya: ఆ సన్నివేశం తీసేప్పుడు చిరు అభిమానిగా ఎంతో సంతోషించా.. ఆసక్తికర విషయం తెలిపిన కొరటాల..