AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya: ఆ సన్నివేశం తీసేప్పుడు చిరు అభిమానిగా ఎంతో సంతోషించా.. ఆసక్తికర విషయం తెలిపిన కొరటాల..

Acharya: మెగాస్టార్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు అపజయం ఎరగని దర్శకుడు..

Acharya: ఆ సన్నివేశం తీసేప్పుడు చిరు అభిమానిగా ఎంతో సంతోషించా.. ఆసక్తికర విషయం తెలిపిన కొరటాల..
Koratala About Acharya
Narender Vaitla
|

Updated on: Dec 02, 2021 | 1:10 PM

Share

Acharya: మెగాస్టార్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు అపజయం ఎరగని దర్శకుడు దర్శకత్వం వహిస్తుండడం, తొలిసారి పూర్తి స్థాయిలో రామ్‌ చరణ్‌, చిరంజీవిలు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అత్యంత జాగ్రత్తగా సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌ పెంచే పనిలో పడ్డ చిత్ర యూనిట్‌ టీజర్‌, సాంగ్‌తో వేగాన్ని పెంచేసింది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు కొరటాల చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర సన్నివేశాలను పంచుకున్నారు. టీజర్‌లో ఉండే రామ్‌ చరణ్‌, చిరంజీవిల సన్నివేశం గురించి కొరటాల మాట్లాడారు. ‘చిరంజీవి, రామ్‌ చరణ్‌ని ఓ వైపు, చిరుతల్ని మరోవైపు చూపించాం. సినిమాలో ఇదో అద్భుతమైన దృశ్యం. అది వాళ్లిద్దరికి సరిగ్గా సరిపోయింది. లక్కీగా అడవి నేపథ్యంలో సాగే సన్నివేశం కావడంతో, ఆ సన్నివేశం వచ్చింది. ఈ సీన్‌ను చిత్రీకరించేప్పుడు నేను దర్శకుడిగా కాకుండా చిరంజీవి అభిమానిగా ఎంతో సంతోషించాను’ అని చెప్పుకొచ్చారు. ఇక ఆచార్యకు సంబంధించిన మరో రెండు సర్‌ప్రైజ్‌లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపిన కొరటాల.. ఈ చిత్రంలో చిరు, చెర్రీలు కలిసి డ్యాన్స్‌ చేసే పాట ఉంటుందని, ఈ పాట చూస్తే అభిమానులకు పండగేనని చెప్పుకొచ్చారు.

Also Read: Jagananna Housing Scheme: పేదలకు పూర్తి హక్కులు కల్పించే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం.. డిసెంబర్ 21న సీఎం జగన్ శ్రీకారం!

Parliament: మళ్లీ సేమ్‌ సీన్‌.. పార్లమెంట్‌ ఆవరణలో విపక్షాల ఆందోళన.. ఎంపీల సస్పెన్షన్‌ ఎత్తివేసేది లేదన్న వెంకయ్య

Viral Video: వీరికి అవార్డ్ అయితే ఇవ్వాల్సిందే.. ఏం పేరు పెడతారో మీరే డిసైడ్ చెయ్యండి

వెండి ధర భారీగా పడిపోనుందా..?
వెండి ధర భారీగా పడిపోనుందా..?
చిరంజీవి హిట్ కొడితే ఇలా ఉంటది.. ఒకే ఫ్యామిలీ నుంచి 140 టికెట్లు.
చిరంజీవి హిట్ కొడితే ఇలా ఉంటది.. ఒకే ఫ్యామిలీ నుంచి 140 టికెట్లు.
క్రికెటర్ కావాలనుకుంటే.. అనుకోని ప్రమాదం క్రీడా మంత్రిని చేసింది
క్రికెటర్ కావాలనుకుంటే.. అనుకోని ప్రమాదం క్రీడా మంత్రిని చేసింది
ఇంట్లో ఇన్సులిన్ మొక్కను ఎలా పెంచాలి? ఇది డయాబెటిస్‌ వారికి వరం!
ఇంట్లో ఇన్సులిన్ మొక్కను ఎలా పెంచాలి? ఇది డయాబెటిస్‌ వారికి వరం!
కరాచీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి!
కరాచీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి!
NTRకి భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
NTRకి భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
ఉదయం లేచినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుందా? అసలు కారణాలు ఇవే!
ఉదయం లేచినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుందా? అసలు కారణాలు ఇవే!
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. 3 నెలల్లోనే 10 కిలోల బరువు తగ్గవచ్చు!
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. 3 నెలల్లోనే 10 కిలోల బరువు తగ్గవచ్చు!
రోజా కూతురును చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్
రోజా కూతురును చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్
71 పరుగులకే 4వికెట్లు ఢమాల్..ఇండోర్‌లో కష్టాల్లో పడ్డ టీమిండియా
71 పరుగులకే 4వికెట్లు ఢమాల్..ఇండోర్‌లో కష్టాల్లో పడ్డ టీమిండియా