PM Modi to visit Mumbai: లెజెండరీ సింగర్, ఇండియన్ నైటింగెల్, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆమెను కడసారి చూడటానికి ముంబైకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ‘‘లతా దీదీకి నివాళులు అర్పించేందుకు ముంబైకి వెళ్తున్నాను’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అంతకు ముందు లతా మంగేష్కర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘లతా దీదీ మనల్ని వదిలి వెళ్లడం నాకు మాటల్లో చెప్పలేనంత బాధగా ఉంది. ఆమె లేని లోటు పూడ్చలేనిది. తన అద్భుత గాత్రంలో ప్రజలను మంత్ర ముగ్ధులను చేసిన లతాను భావి తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు’ అంటూ రాసుకొచ్చారు పీఎం మోదీ.
కాగా, లతా మంగేష్కర్ భౌతికకాయాన్ని మధ్యాహ్నం ముంబైలోని పెద్దార్ రోడ్‌లో గల ఆమె నివాసం ‘ప్రభుకుంజ్’కి తీసుకొచ్చారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రభుత్వ లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, లతా మంగేష్కర్ స్మారకార్థం రెండు రోజుల పాటు జాతీయ సంతాప దినాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రముఖ గాయని లతా మంగేష్కర్(92) న్యూమోనియాతో పాటు, కరోనా సోకడంతో ముంబైలోని ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేరారు. తొలుత కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. ఆ తరువాత ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా వైఫల్యం చెందడం మొదలైంది. ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ ప్రతీత్ సమదానీ.. ఇవాళ ఉదయం మీడియా ముందుకు వచ్చి లతా మంగేష్కర్ ఇక లేరంటూ చేదు వార్తను ప్రకటించారు. అవయవాలు ఫేయిల్ అవడంతో ఆదివారం ఉదయం 06.30 గంటలకు ఆమె కన్నుమూశారంటూ వెల్లడించారు.
28 సెప్టెంబర్, 1929న జన్మించిన లతా మంగేష్కర్ 1942లో 13 ఏళ్ల వయసులో సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. దాదాపు ఏడు దశాబ్దాల కెరీర్‌లో ఈ మెలోడీ క్వీన్ వెయ్యికి పైగా హిందీ చిత్రాలకు పాటలను పాడారు. అలాగే దేశంలోని 36 ప్రాంతీయ భాషలలో, విదేశీ భాషలలో కూడా పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె మధురమైన గాత్రానికి మెచ్చిన భారత ప్రభుత్వం లతా మంగేష్కర్‌ని ‘నైటింగెల్ ఆఫ్ ఇండియా’ బిరుదుతో కీర్తించింది. ఇక 2001లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎంఎస్ సుబ్బలక్ష్మి తరువాత బారతరత్న పొందిన రెండవ గాయనిగా లతా మంగేష్కర్ నిలిచారు. ఇవే కాదు.. అనేక జాతీయ అవార్డులను ఆమె అందుకకున్నారు.
Will be leaving for Mumbai in some time to pay my last respects to Lata Didi.
— Narendra Modi (@narendramodi) February 6, 2022
Also read:
Kakinada: ఒక్క చేపతో లక్కు తిరిగిపోయింది.. వేలంలో ఎంత పలికిందో తెలిస్తే షాక్ తింటారు