తన మధురమైన గొంతుతో పాటకే అందం తీసుకొచ్చారు లెజెండరీ సింగర్ లతామంగేష్కర్. దాదాపు 6 దశాబ్దాల పాటు తన గాత్రంతో ప్రపంచాన్ని ఊర్రూతలూగించారు. 36కి పైగా భారతీయభాషలతో పాటు విదేశీ భాషల్లోనూ వేలాదికి పైగా పాటలు పాడి సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లతాజీ పాటలు వింటుంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోవచ్చని పలువురు ప్రముఖులు, సంగీత విద్వాంసులు మెచ్చుకోవడం ఆమె గాన ప్రతిభకు దక్కిన నిదర్శనం. తన వినసొంపైన పాటలతో భారతీయ సినిమాకు గుర్తింపు తీసుకురావడంలో లతా మంగేష్కర్ విశేష కృషి చేశారు. అందుకే ఇప్పుడామె మన మధ్య లేకపోయినా ఆమె పుట్టిన పాటలు ఎక్కడో ఒకచోట ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె గొంతు శాశ్వతంగా మూగబోయింది. కాగా నేడు లతాజీ పుట్టిన రోజు. కాగా భారతీయ సినిమా పరిశ్రమకు ఆమెకు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు ప్రముఖులు ఆమెకు ఘన నివాళి అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన అయోధ్యలో ఓ వీధికి ఆమె పేరు పెట్టారు.
కాగా అయోధ్యలోని చౌక్‌కు లతా మంగేష్కర్ పేరు పెట్టడం పట్ల ప్రధాని ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘లతా దీదీ జయంతి సందర్భంగా ఆమెను మరోసారి స్మరించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమె చూపించిన ప్రేమాభిమానాలు నాకింకా గుర్తున్నాయి. ఈరోజు అయోధ్యలోని ఒక చౌక్‌కి ఆమె పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. భారతీయ ఐకాన్లలో ఒకరైన లతాజీకి ఇదే తగిన నివాళి’ అని ట్వీట్ చేశారు మోడీ. మోడీతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజు తదితర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా లతాజీకి నివాళి అర్పించారు.
Remembering Lata Didi on her birth anniversary. There is so much that I recall…the innumerable interactions in which she would shower so much affection. I am glad that today, a Chowk in Ayodhya will be named after her. It is a fitting tribute to one of the greatest Indian icons.
— Narendra Modi (@narendramodi) September 28, 2022
కాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లతా మంగేష్కర్ చౌక్‌ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అలాగే 40 అడుగుల భారీ వీణను కూడా ఆవిష్కరించనున్నారు. భారత శాస్త్రీయ సంగీత పరికరమైన ఈ వీణ సైజు 40అడుగుల పొడవు, 14టన్నుల బరువు ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తీర్చిదిద్దిన శిల్పి రామ్ వన్‌జీ సుతార్ ఈ వీణను రూపొందించారు. ఇక లతాజీ విషయానికొస్తే.. సెప్టెంబర్ 28, 1929న జన్మించిన లతా మంగేష్కర్ 1942లో తన 13వ ఏట తన సినిమా కెరీర్‌ను ప్రారంభించింది. ఏడు దశాబ్దాల కెరీర్‌లో, మెలోడీ క్వీన్ వెయ్యికి పైగా హిందీ చిత్రాల్లో పాటలు పాడింది. తన పాటలకు గుర్తింపుగా ఆమెను ‘క్వీన్ ఆఫ్ మెలోడీ’ మరియు ‘ఇండియాస్ నైటింగేల్’ అని పిలుస్తారు.
I fondly remember Bharat Ratna Lata Mangeshkar Ji on her birth anniversary. Through her beautiful and melodious songs, she continues to stay with us. Her legacy and contribution to Indian cinema music is unparalleled. My pranams to her. pic.twitter.com/IYzfm2foKx
— Pralhad Joshi (@JoshiPralhad) September 28, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..