Kareena Kapoor: కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం

|

Dec 23, 2024 | 8:36 PM

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కరీనా కపూర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సింగం అగైన్ వంటి కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటోన్న ఈ అందాల తార బకింగ్ హమ్ ప్యాలెస్ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇటీవల బెబో నటించిన క్రూ సినిమా బ్లాక్ బస్టర్ గా నటించింది.

Kareena Kapoor: కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
Kareena Kapoor
Follow us on

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కరీనా కపూర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 44 ఏళ్ల వయసులోనూ ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.  ‘జబ్ వి మెట్’, ‘గుడ్‌న్యూస్’, ‘వీరే ది వెడ్డింగ్’, ‘ఉడ్తా పంజాబ్’, ‘బజరంగీ భాయిజాన్’, ‘బాడీగార్డ్’, ‘గోల్‌మాల్ 3’ ‘క్రూ’ తదితర సినిమాలు కరీనా క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ఇక పెళ్లై, ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన తర్వాత కూడా హీరోయిన్ ఆఫర్లు అందుకుంటోందీ ముద్దుగుమ్మ. అలాగే సోషల్ మీడియాలోనూ ఆమెకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దానికి కారణం ఆమె ఫిట్ నెస్ అండ్ ఫ్యాషన్ సెన్స్. చాలా మంది పెద్ద ఆర్టిస్టులు కరీనాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో కరీనాపై ఓ పాకిస్థానీ ప్రముఖ నటుడు చేసిన ప్రకటన ఆమె అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఖాకాన్ షానవాజ్ పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ నటుడు. 27 ఏళ్ల ఈ క్రేజీ యాక్టర్ చాలా సినిమాలు వెబ్ సిరీస్‌లలో నటించాడు. అలాగే కొన్ని రియాల్టీ షోలలో కూడా పాల్గొన్నాడు. ఇక సోషల్ మీడియాలోనూ షానవాజ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. కాగా షానవాజ్‌ ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. మీరు కరీనా కపూర్‌తో నటిస్తే చూడాలనుందని మనసులో మాట బయటపెట్టాడు.

దీనికి స్పందించిన పాకిస్తానీ నటుడు.. ‘అవునా.. సరే, నేను ఆమెకు కుమారుడిలా నటిస్తాను. అలాంటి ఆఫర్‌ వస్తే కచ్చితంగా చేస్తాను. నా కంటే కరీనా వయసులో చాలా పెద్దది. కాబట్టి నేను కేవలం ఆమెకు కుమారుడిగా మాత్రమే యాక్ట్ చేయగలను’ అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కరీనా కపూర్‌ ఫ్యాన్స్‌ పాక్ నటుడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. .’పాకిస్థానీ నటులు భారత్‌లో సినిమాలు చేయడానికి వీలు లేదు లే బ్రో’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కరీనా కపూర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటో..

కరీనా కపూర్ 2000లో తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించింది. తన అందం, అభినయంతో బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడామె వయసు సుమారు 44 సంవత్సరాలు. అయినా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే కరీనాపై కామెంట్స్ చేసిన మరియు ఖాకాన్‌ షానవాజ్ వయసు సుమారు 27 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ సుమారు 17 సంవత్సరాలన్నమాట.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి