20 Years of Lagaan: ఆస్కార్ బరిలో నిలిచి తృటిలో చేజార్చుకున్న లగాన్ కు భారతీయ సినీ చరిత్రలో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. బీ టౌన్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించి నిర్మించిన సినిమా లగాన్. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కిన లగాన్ 2001 జూన్ 15వ తేదీన విడుదలైంది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. రూ.25 కోట్లతో తెరకెక్కించారు. గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలో భారీ సెట్లను వేశారు. 2001 జూన్ 15వ తేదీన రిలీజైన ఈ చిత్రం 66 కోట్లు వసూలు చేసింది.క్రీడా స్పూర్తితో తెరకెక్కిన ఈ సినిమా గురించి కొన్ని విశేషాలను ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకుందాం..
1957లో రిలీజైన నయా దౌర్ అనే చిత్రం స్పూర్తితో లగాన్ సినిమా ను తెరకెక్కించామని దర్శకుడు అశుతోష్ గోవారికర్ వెల్లడించారు. క్రీడా నేపథ్యంతో ఈ సినిమాను అమీర్ ఖాన్ మొదట నో చెప్పారట. అయితే కథ విన్న తర్వాత అమీర్ ఖాన్ కంట నీరు తెప్పించిందట.. వెంటనే సినిమాలో నటించడానికి కూడా ఒప్పుకున్నారట. అయితే సినిమాను ఎవరూ నిర్మించడానికి ముందుకు రాకపోతే తానే నిర్మాతగా మరి లగాన్ ను నిరించారట . అలా బాలారిష్టాలను దాటి లాగిన్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.
లగాన్ అంటే వ్యవసాయంపై విధించే పన్ను అని అర్ధం. బ్రిటిష్ పాలనలో విక్టోరియా పీరియడ్ లో చోటు చేసుకున్నఓ కథతో లాగన్ చిత్రం తెరకెక్కింది. ఓ గ్రామంలో కరువు తాండవిస్తున్న సమయంలో బ్రిటిష్ పాలకుల వసూలు చేస్తున్న పన్నుల నుంచి మినహాయింపు కోసం గ్రామస్థులు చేసే పోరాటమే లగాన్ మూవీ.
బ్రిటిష్ వారికీ కట్టలేని పరిస్థితుల్లో ఆ పన్ను మినహాయింపు నుంచి తప్పించుకొనేందుకు గ్రామస్థులు ప్రొఫెషనల్స్ అయిన బ్రిటీష్ క్రికెటర్లతో క్రికెట్ ఆటకు సిద్దపడుతారు. అసలు క్రికెట్ అంటే ఏమిటో తెలియని గ్రామస్థులు బ్రిటిషర్లను ఎలా ఓడించారనేది సినిమా కథ.
అంతర్జాతీయ స్థాయిలో లగాన్ కు అద్బుతమైన ఖ్యాతి దక్కింది. ఆస్కార్ అవార్డుల రేస్ లో నిలిచి ఇతర చిత్రాలకు గట్టి పోటీనిచ్చినా చివరకు ఐదే స్థానంలో నిలిచింది. అప్పట్లో మదర్ ఇండియా, సలాం బాంబే తర్వాత ఆస్కార్‌కు నామినేట్ అయిన మూడో చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. విదేశీ విభాగంలో ఉంటే కమిటీ సభ్యులంతా హాలీవుడ్, ఇతర దేశాలకు సంబంధించిన వారే ఉంటారు. కాబట్టి భారతీ సినిమాల ఆత్మను అర్ధం చేసుకోవడం వారికి చాలా కష్టం అంటూ అమీర్ ఖాన్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ సినిమాతోనే గ్రేసీ సింగ్ హీరోయిన్ గా వెండి తెరపై అడుగు పెట్టింది. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.
Also Read: స్వచ్ఛందంగా రక్తదానం చేసిన సచిన్.. తన అభిమానులు బ్లడ్ డొనేట్ చేయాలని పిలుపు