Salman Khan: బిగ్ బాస్ స్టేజ్ పై చేతిలో సిగరెట్‌తో సల్మాన్ ఖాన్.. ఫైర్స్ అవుతున్న నెటిజన్స్..
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సల్మాన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అందుకు కారణం కూడా ఉంది. ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ వేదికపై ఆయన చేతిలో సిగరెట్ కనిపించడమే నెటిజన్స్ ఆగ్రహానికి కారణం. దీంతో ఆ స్టార్ హీరోపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. మరోవైపు సల్మాన్ ఫ్యాన్స్ కొద్దిగా నిరాశ చెందినప్పటికీ తమ హీరోను సమర్థించుకునే పనిలో పడ్డారు.
సల్మాన్ ఖాన్ .. పాన్ ఇండియా వ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. నార్త్ టూ సౌత్ సల్మాన్ మూవీస్ కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. ఇక సినిమా గురించి కాకుండా.. ఎక్కువగా వివాదాల్లో నిలిచే హీరో సైతం ఆయనే. ఇప్పటికే సల్మాన్ గురించి అనేక వార్తలు ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంటాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సల్మాన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అందుకు కారణం కూడా ఉంది. ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ వేదికపై ఆయన చేతిలో సిగరెట్ కనిపించడమే నెటిజన్స్ ఆగ్రహానికి కారణం. దీంతో ఆ స్టార్ హీరోపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. మరోవైపు సల్మాన్ ఫ్యాన్స్ కొద్దిగా నిరాశ చెందినప్పటికీ తమ హీరోను సమర్థించుకునే పనిలో పడ్డారు.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఇటీవల బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ పై కంటెస్టెంట్స్ తప్పోప్పులను విశ్లేషణ చేస్తున్నారు సల్మాన్. ఆ సమయంలో అతని చేతిలో సిగరెట్ పట్టుకుని ఉన్నారు. ఇంకేముంది అది చూసిన నెటిజన్స్.. కంటెస్టెంట్స్ గురించి మాట్లాడే సమయంలో సల్మాన్ ఖాన్ సిగరెట్ కాల్చారంటూ ఫైర్ అయ్యారు. ఎంతో మందికి స్పూర్తిగా ఉండే మీరు.. కెమెరా ముందు ఇలాంటి పనులు చేయకూడదని ఆ మాత్రం తెలియదా అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈకామెంట్స్ పై సల్మాన్ గానీ.. బిగ్ బాస్ టీం గానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఇటీవలే కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు సల్మాన్. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన టైగర్ 3 చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత కిక్ 2 చేయనున్నారు.
Haath mein cigarette while hosting 🔥 Radhe mohan mode activated #SalmanKhan𓃵 🔥🔥 pic.twitter.com/bxpzJUiaUM
— 🔥UTKARSH🔥| Fan account (@BEINGRADHE2727) July 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.