Lucky Ali: అలీ మరణించలేదు.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు.. పుకార్లు నమ్మకండి

ప్రముఖ గాయకుడు లక్కీ అలీ అనారోగ్యంతో కన్నుమూశారని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. కరోనా సోకడంతో  అనారోగ్యానికి గురై లక్కీ మరణించారని వార్తలు పుట్టుకొచ్చాయి. 

Lucky Ali: అలీ మరణించలేదు.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు.. పుకార్లు నమ్మకండి

Updated on: May 05, 2021 | 11:55 AM

Lucky Ali: ప్రముఖ గాయకుడు లక్కీ అలీ అనారోగ్యంతో కన్నుమూశారని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. కరోనా సోకడంతో  అనారోగ్యానికి గురై లక్కీ మరణించారని వార్తలు పుట్టుకొచ్చాయి.  ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నటి  నఫీసా అలీ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. లక్కీ అలీ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

దయచేసి పుకారులను నమ్మకండి అంటూ ఆమె అభిమానులను కోరారు. మంగళవారం సాయంత్రం లక్కీ మరణం గురించి నకిలీ నివేదిక వెలువడిన తరువాత ట్విట్టర్ సంతాప సందేశాలతో నిండిపోయింది. అందరు ఆయన మరణించాడని భావించి ఆయన ఫొటోలతో సంతాప సందేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో నఫీసా మంగళవారం అర్థరాత్రి ట్వీట్ చేస్తూ.. “లక్కీ పూర్తిగా బాగానే ఉన్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. తన కుటుంబంతో కలిసి లక్కీ ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. అలాగే ఆయనకు కొవిడ్ సోకలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం లక్కీ అలీ ఖాన్ బెంగుళూరు లోని తన ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

 Music director Thaman: చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా తమన్.. రెమ్యునరేషన్ కూడా పెంచేసాడంటున్నారే ..

Pooja Hedge: ఆ స్టార్ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటున్న బుట్టబొమ్మ

Sonu Sood : కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు రియల్ హీరో సోనూసూద్ విజ్ఞప్తి… మద్దతు తెలిపిన గ్లోబల్ బ్యూటీ..