Mumbai Cruise Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సంచలన మలుపు.. ఏకంగా షారుక్ ఖాన్ నే…
Mumbai Cruise Drugs Case: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వినియోగం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆర్యన్ ఖాన్‌ను ఈ కేసు నుంచి తప్పించేందుకు..
Mumbai Cruise Drugs Case: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వినియోగం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆర్యన్ ఖాన్‌ను ఈ కేసు నుంచి తప్పించేందుకు దర్యాప్తు అధికారులు భారీ ప్రయత్నమే చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డ్రగ్స్ కేసు విచారిస్తున్న జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే.. షారుక్ ఖాన్‌ను భారీగా డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న ఎన్‌సీబీ.. జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై విచారణ చేపట్టింది. డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలో సమీర్ వాంఖడేపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టారు. కాగా, డ్రగ్స్ కేసు విచారణ నుంచి సమీర్ వాంఖడే నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది.
ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో అరెస్టై ముంబై ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న కొడుకు ఆర్యన్ ఖాన్‌ను షారుక్ ఖాన్ కలిశారు. తనయుడి అరెస్ట్ తర్వాత షారుక్ తొలిసారి బయట కనిపించారు. ఇప్పటికే ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను మూడుసార్లు తిరస్కరించింది కోర్ట్. డ్రగ్స్ పెడ్లర్స్‌తో ఆర్యన్‌కు సంబంధాలున్నాయని..అందుకు ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించింది ఎన్సీబీ. ఓ హీరోయిన్‌తో ఆర్యన్ చేసిన చాటింగ్‌ను కూడా కోర్టు ముందుంచారు. ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఎన్సీబీ వాదనతో ఏకీభవించిన కోర్టు.. ఆర్యన్‌కు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. ఈ క్రమంలో దర్యాప్తు అధికారి సమీర్ వాంఖడే అవినీతి ఆరోపణలు రావడం మరింత కలకలం సృష్టిస్తోంది. మరి ఈ ఆరోపణలు ఈ కేసును ఇంకెక్కడికి తీసుకెళ్తాయో వేచి చూడాల్సిందే.
ఇదిలాఉంటే.. ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న బృందాన్ని, అందులో ఉన్న షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను కూడా ఎన్‌సిబి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన తరఫు న్యాయవాదులు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటి వరకు మూడు సార్లు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. ముడు సార్లూ కోర్టులో చుక్కెదురైంది. ఆర్యన్ బెయిల్ పిటిషన్ పదేపదే తిరస్కరణకు గురవుతోంది. అయితే, కింది కోర్టులో బెయిల్ రాకపోయినా హైకోర్టులో తప్పకుండా బెయిల్ వస్తుందని భావిస్తున్నారు షారుఖ్ కుటుంబ సభ్యులు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Also read:
IND vs PAK: ఇండియా కొంపముంచినవి.. పాక్‌కు కలిసొచ్చిన అంశాలు ఇవే..