బాలీవుడ్ సీనియర్ నటుడు , రాజకీయ నాయకుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఛాతీ నొప్పితో బాధపడుతున్న మిథున్ చక్రవర్తిని కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చనట్లు సమాచారం. ఒకప్పటి స్టార్ హీరో, డిస్కోడ్యాన్సర్ అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. నేటికీ మిథున్ చక్రవర్తికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో అందోళన నెలకొంది.
ఒక నివేదిక ప్రకారం ఈ రోజు ఉదయం అంటే ఫిబ్రవరి 10వ తేదీన మిథున్ చక్రవర్తికి అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చింది. తీవ్రంగా బాధపడుతున్న మిథున్ ఆరోగ్యం క్షీణించడం చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే మిథున్ చక్రవర్తి కి MRI స్కాన్ చేసినట్లు తెలుస్తోంది. చికిత్స కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వైద్యులు అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఇప్పటి వరకు ఆసుపత్రి సిబ్బంది మిథున్ చక్రవర్తి వ్యాధి గురించి, ఆరోగ్య పరిస్థితి గురించి ఎటువంటి సమాచారం చెప్పలేదు.
ఈ రోజు ఉదయం మిథున్ చక్రవర్తి తన రాబోయే చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. షూటింగ్ జరుగుతున్నా సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించిందని భావిస్తున్నారు. షూటింగ్ స్పాట్ లో బాధతో అక్కడే నేలపై కూర్చిండి పోయినట్లు.. అది గమనించిన చిత్ర బృందం వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..