Sameer Wankhede: ఆర్యన్‌ను నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు రూ. 25 కోట్ల లంచం డిమాండ్.
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌సీబీ ముంబయి విభాగం మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు లంచం అడిగారంటూ ఎన్‌సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పై ఆరోపణలు వచ్చాయి.
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌సీబీ ముంబయి విభాగం మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు లంచం అడిగారంటూ ఎన్‌సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఆ వివరాల ఆధారంగా ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది. వాంఖడేపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. పలువురు ఎన్‌సీబీ మాజీ అధికారులకు సమన్లు జారీ చేసినట్లు తెలిపాయి. వాంఖడే.. ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 2021 అక్టోబరులో డ్రగ్స్ పార్టీకి సంబంధించిన కేసులో ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఎన్‌సీబీ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆ తర్వాత వాంఖడేపై పలు ఆరోపణలు రావడంతో జోనల్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీ చేసి, విచారణ చేపట్టారు.
విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు వాంఖడేతో పాటు మరో నలుగురు షారుక్ నుంచి 25 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశారని సాక్షిగా ఉన్న వ్యక్తులు బయటపెట్టారు. దీంతో అంతర్గత దర్యాప్తు చేపట్టిన ఎన్‌సీబీ ఆ వివరాలను సీబీఐకి అందించింది. అనంతరం వాంఖడేపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. అతడికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని దర్యాప్తులో తేలింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..