Miss Universe Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ హర్నజ్ సంధు పై చీటింగ్ కేసు.. ఎందుకంటే ?..

|

Aug 05, 2022 | 6:46 PM

అయితే మిస్ యూనివర్స్ 2021 టైటిల్ గెలిచాక సినిమా ప్రమోషన్ కు డేట్స్ ఇవ్వడానికి ఆమె నిరాకరించిందని సింగ్ తెలిపారు. తాము కాల్స్ చేసిన స్పందించడం లేదు ఉపాసన సింగ్ పేర్కొంది.

Miss Universe Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ హర్నజ్ సంధు పై చీటింగ్ కేసు.. ఎందుకంటే ?..
Harnaz
Follow us on

మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ కౌర్ సంధుపై చీటింగ్ కేసు నమోదైంది. తన సినిమా కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆమె ఉల్లంఘించిందంటూ పంజాబ్ చిత్ర నిర్మాత ఉపాసన సింగ్ గురువారం స్థానిక కోర్టును ఆశ్రయించారు. హర్నాజ్ (Harnaaz Sandhu) వల్ల తాను ఆర్థికంగా తీవ్ర నష్టపోయానని.. తన నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును కోరింది. మిస్ యూనివర్స్ కాకముందు హర్నాజ్ తాను నిర్మించిన బాయి జీ కుట్టంగే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ఆమె సంతోష్ ఎంటర్టైన్మెంట్ స్టూడియో, ఎల్ఎల్పీతో ఒప్పందం కుదుర్చుకుంది. మూవీ షూటింగ్ నుంచి విడుదలయ్యేంత వరకు సినిమా ప్రమోషన్లలో హర్నాజ్ పాల్గొనాల్సి ఉంటుంది. (Miss Universe Harnaaz Sandhu)

అయితే మిస్ యూనివర్స్ 2021 టైటిల్ గెలిచాక సినిమా ప్రమోషన్ కు డేట్స్ ఇవ్వడానికి ఆమె నిరాకరించిందని సింగ్ తెలిపారు. తాము కాల్స్ చేసిన స్పందించడం లేదు ఉపాసన సింగ్ పేర్కొంది. అంతేకాకుండా మూవీ టీం ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని.. తమను పూర్తిగా అవైయిడ్ చేసిందని తెలిపారు సింగ్. ఈ సినిమా కోసం హర్నాజ్ సంధుకు భారీ మొత్తంలో చెల్లించామని.. ఇప్పుడు హర్నజ్ తప్పుకోవడంతో తాను ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయానని సింగ్ పిటిషన్లో పేర్కొంది. ఇప్పటికే ఆమెకు నోటిసులు పంపించామని.. కానీ ఆమె నుంచి ఎలాంటి రెస్పాండ్ రాలేదని.. అందుకే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో ఆమెకు కోర్టు శుక్రవారం నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అయితే తనపై నమోదైన కేసు గురించి ఇప్పటివరకు హర్నాజ్ స్పందించలేదు. 2021 మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది హర్నాజ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.