Rhea Chakraborty: ‘చివరికి.. ఈ క్షణంలో జీవించడం ఎలాగో నేర్చుకుంది’.. ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన రియా చక్రవర్తి.

|

Feb 26, 2022 | 7:29 AM

Rhea Chakraborty: రియా చక్రవర్తి.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2020లో బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ (Sushant Singh Rajput) మరణం తర్వాత ఈ హీరోయిన్‌ పేరు ఒక్కసారిగా మారుమోగింది. సుశాంత్‌ ఆత్మహత్య కేసు...

Rhea Chakraborty: చివరికి.. ఈ క్షణంలో జీవించడం ఎలాగో నేర్చుకుంది.. ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన రియా చక్రవర్తి.
Rhea Chakraborty
Follow us on

Rhea Chakraborty: రియా చక్రవర్తి.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2020లో బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ (Sushant Singh Rajput) మరణం తర్వాత ఈ హీరోయిన్‌ పేరు ఒక్కసారిగా మారుమోగింది. సుశాంత్‌ ఆత్మహత్య కేసులో రియా పేరు ప్రధానంగా వినిపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రియాకు డ్రగ్స్‌తో (Drugs) సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్నో రోజుల పాటు జైలు చుట్టూ తిరిగింది. ఈ క్రమంలోనే నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో రియాను అరెస్ట్ కూడా చేసింది. ప్రియుడి మరణం, పోలీసుల విచారణ.. ఇలా ఎంతో మనో వేదనకు గురైన రియా ఇప్పుడిప్పుడే మళ్లీ మాములు మనిషిగా మారుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా తన స్నేహితుడు షిబానీ దండేకర్‌ వివాహానికి హాజరైంది రియా చక్రవర్తి. ఈ క్రమంలోనే పెళ్లి వేడుకల్లో భాగంగా కొన్ని ఫోటోలు దిగిన రియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటోలకు రియా ఇచ్చిన క్యాప్షన్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎల్లో కలర్‌ లెహెంగాలో దిగిన ఫోటోలను పోస్ట్ చేసిన రియా.. ‘ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట.. చివరికీ ఆమె ప్రస్తుత క్షణంలో ఎలా జీవించాలోనేర్చుకుంది.’ అంటూ క్యాప్షన్​రాసుకొచ్చింది.

దీంతో రియా చేసిన ఈ పోస్ట్‌ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇన్ని రోజుల పాటు ఎంతో మనో వేధనకు గురైన రియా ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నట్లు ఆమె పోస్ట్‌ చూసిన వారికి అర్థమవుతోంది. ఇక రియా చేసిన ఈ పోస్టుకు అభిమానులు కూడా లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల సంఖ్యలో లైక్‌లు రావడం విశేషం.\

Also Read: Ind Vs Sl: మరో సిరీస్‌పై టీమిండియా గురి.. లంకేయులతో నేడు రెండో టీ 20 మ్యాచ్‌..

గడ్డకట్టే మంచులో జవాన్ల శిక్షణ.. ఎప్పుడైనా చూసారా.. వీడియో

దేవుడి దర్శనానికి వెళ్తే.. పెద్ద పులి దర్శనం.. భయంతో చెట్టెక్కిన యువకులు !! వీడియో