Tollywood: ఒకప్పుడు 12th ఫెయిల్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్.. కోట్లలో ఆస్తులు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో గ్రాడ్యుయేషన్ వరకు కూడా చదువుకోని సినిమా తారలు చాలామందే ఉన్నారు. కొద్ది మందైతే ఇంటర్మీడియెట్ తోనే చదువు ఆపేశారు. ఈ స్టార్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇంటర్ ఫెయిలైన ఈ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.

ఇటీవలే 12వ తరగతి ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో చాలామంది విద్యార్థులు, విద్యార్థినులు 99 శాతం, 98 శాతం మార్కులు తెచ్చుకున్నారు. అలాగే 100 శాతం ఫలితాలు సాధించిన కళాశాలలు చాలా ఉన్నాయి. అయితే మన సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంటర్మీడియెట్ తప్పిన సినీ తారలు చాలామందే ఉన్నారు. పై ఫొటోలో కనిపిస్తోన్న స్టార్ హీరోయిన్ కూడా ఈ కోవకే చెందుతుంది. భారతీయ సినిమా అత్యంత అందమైన, ప్రతిభ కల నటీమణులలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. కెరీర్ ప్రారంభంలో కేవలం స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ క్రమంగా రూట్ మార్చింది. మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో మాత్రమే యాక్ట్ చేసింది. అది కూడా తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ కేవలం హీరోయిన్ గానే కాకుండా దర్శకురాలిగానూ సత్తా చాటుతోంది. నిర్మాతగానూ వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. బోల్డ్ గా మాట్లాడే ఈ బ్యూటీ పేరు పలు వివాదాల్లోనూ తరచూ వినిపిస్తోంది. తరచూ బంధుప్రీతి (నెపోటిజమ్) గురించి మాట్లాడుతూ స్టార్ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్ల గురించి కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తుంటుంది. అన్నట్లు ఈ హీరోయిన రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. పార్లమెంట్ సభ్యురాలిగా ప్రజా సేవ చేస్తోంది. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ స్టార్ హీరోయిన కమ్ పొలిటికల్ లీడర్ మరెవరో కాదు కంగనా రనౌత్.
కాగా కంగనా రనౌత్ 12వ తరగతిలో ఫెయిల్ అయిందట. ఆ తర్వాత ఆ నటి తన చదువును వదిలి మోడలింగ్‌లో కెరీర్‌ను కొనసాగించింది. ఇప్పుడు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనే సత్తా చాటుతోందీ అందాల తార. ఇక సినిమాల విషయానికి వస్తే.. కంగనా చివరిగా ఎమర్జెన్సీ సినిమాలో నటించింది. ఇందులో కంగనా నటించడమే కాకుండా సినిమాకు దర్శకురాలిగానూ వ్యవహరించింది. అంతే కాదు నిర్మాతగానూ కంగనానే భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ పెద్దగా విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీని తర్వాత కంగనా నటించే సినిమా గురించి ఇంకా అప్ డేట్ రావాల్సి ఉంది.
కంగనా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
తన రెస్టారెంట్ స్టాఫ్ తో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








