Laa pataa Ladies: ఆస్కార్ బరిలో ‘లాపతా లేడీస్’.. అధికారిక ప్రకటన.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

|

Sep 23, 2024 | 4:25 PM

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన 'లాపతా లేడీస్' 97వ ఆస్కార్ పోటీలకు అధికారికంగా ఎంపికైంది . హీరో అమీర్‌ఖాన్‌ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ ఏడాది మార్చి 1న విడుదలైన ఈ సినిమాలో స్పర్ష్ శ్రీవాస్తవ్, నితాన్షి గోయల్, ప్రతిభా రంతా, రవి కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు.

Laa pataa Ladies: ఆస్కార్ బరిలో లాపతా లేడీస్.. అధికారిక ప్రకటన.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Laapataa Ladies
Follow us on

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ 97వ ఆస్కార్ పోటీలకు అధికారికంగా ఎంపికైంది . హీరో అమీర్‌ఖాన్‌ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ ఏడాది మార్చి 1న విడుదలైన ఈ సినిమాలో స్పర్ష్ శ్రీవాస్తవ్, నితాన్షి గోయల్, ప్రతిభా రంతా, రవి కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. మహిళా సాధికారతకు సంబంధించిన కథతో ఎంతో ఆసక్తికరంగా లాపతా లేడీస్ సినిమాను తెరకెక్కించారు కిరణ్ రావు. ఈ సినిమాకు ఆస్కార్ దక్కాలనేది కిరణ్ రావు కల. ఇప్పుడామె కల నిజమైంది. ‘‘లపాట లేడీస్’ ‘ చిత్రం ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగంలో ఎంపికైంది. ఈ విషయాన్ని ‘భారత్ ఫిల్మ్ ఫెడరేషన్’ సభ్యులు చెన్నైలో ప్రకటించారు. ‘లపాతా ​​లేడీస్’ సినిమా 2001లో గ్రామీణ భారతం నేపథ్యంలో సాగుతుంది. అమీర్ ఖాన్ నిర్మించిన ‘లపాతా లేడీస్’ గతంలో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఆస్కార్‌ పోటీకి ఎంపిక కావడంపై లపాతా లేడీస్ దర్శకురాలు కిరణ్‌రావు ఫస్ట్‌ రియాక్షన్‌ ఇచ్చింది. ఆమె దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘లపాట లేడీస్‌’. అంతకు ముందు ‘గోబీ ఘాట్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘లపాట లేడీస్’ సినిమా హిట్టయ్యిందని ప్రేక్షకులే కాదు పలువురు సినీ ప్రముఖులు సైతం అంటున్నారు. ఇప్పుడు ఆస్కార్‌కి ఎంపిక కావడంతో చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కిరణ్‌రావు పలువురికి కృతజ్ఞతలు తెలిపారు.

‘మా సినిమా ఆస్కార్‌ పోటీకి ఎంపిక కావడం టీమ్‌ మొత్తం కృషికి, అభిరుచికి నిదర్శనం. సినిమా ఎప్పుడూ హృదయాలను కరిగించే, అర్థవంతమైన కమ్యూనికేషన్‌ని సృష్టించే, సరిహద్దులను అధిగమించే మాధ్యమం. భారతీయులకు నచ్చిన విధంగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను’ లపాట లేడీస్ సినిమాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ, సెలక్షన్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది ఎన్నో ఉత్తమ చిత్రాలలో మా చిత్రం ఎంపిక కావడం గర్వించదగ్గ విషయం. మాకు సపోర్ట్ చేస్తున్న అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మరియు జియో స్టూడియోస్‌కి ధన్యవాదాలు. టాలెంటెడ్ టెక్నీషియన్స్‌తో పనిచేసినందుకు గర్వంగా ఉంది. అలాగే ఈ సినిమా నిర్మాణానికి సహకరించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ టీమ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది మరిచిపోలేని ప్రయాణం’ అని కిరణ్ రావు అన్నారు. అలాగే సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ సూపర్ హిట్ సినిమా ‘Netflix’ OTTలో అందుబాటులో ఉంది.

లాపతా లేడీస్ ట్రైలర్..

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.