Tiger 3: టవల్ ఫైట్‌ కోసం మన మల్లీశ్వరి ఇంత కష్టపడిందా? వీడియో షేర్‌ చేసిన కత్రినా

|

Nov 07, 2023 | 7:00 AM

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ యాక్షన్‌ సీన్లలో నటించడం కొత్తేమీకాదు. గతంలో పలు సినిమాల్లో ఫైట్‌ సీక్వెన్స్‌లో నటించి మెప్పించింది. అయితే యాక్షన్ సన్నివేశాల్లో నటించిన ప్రతిసారీ ఎంతో కొంత శిక్షణ తీసుకుంటుంటుంది. ఒక సినిమా నుండి మరో సినిమాకి ఇంప్రూవ్‌మెంట్ చూడాలన్నది ఆమె లక్ష్యం. అలా సల్మాన్‌ హీరోగా నటిస్తోన్న టైగర్‌ 3 సినిమా కోసం కూడా క్యాట్‌ చాలా కష్టపడింది

Tiger 3: టవల్ ఫైట్‌ కోసం మన మల్లీశ్వరి ఇంత కష్టపడిందా? వీడియో షేర్‌ చేసిన కత్రినా
Katrina Kaif
Follow us on

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ యాక్షన్‌ సీన్లలో నటించడం కొత్తేమీకాదు. గతంలో పలు సినిమాల్లో ఫైట్‌ సీక్వెన్స్‌లో నటించి మెప్పించింది. అయితే యాక్షన్ సన్నివేశాల్లో నటించిన ప్రతిసారీ ఎంతో కొంత శిక్షణ తీసుకుంటుంటుంది. ఒక సినిమా నుండి మరో సినిమాకి ఇంప్రూవ్‌మెంట్ చూడాలన్నది ఆమె లక్ష్యం. అలా సల్మాన్‌ హీరోగా నటిస్తోన్న టైగర్‌ 3 సినిమా కోసం కూడా క్యాట్‌ చాలా కష్టపడింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు, కత్రినా కైఫ్ కూడా యాక్షన్‌ సన్ని వేశాల్లో అద్భుతంగా నటించింది. అదెలా ఉంటుందో ట్రైలర్‌లోనే తెలిసిపోయింది. ముఖ్యంగా ట్రైలర్‌లో వచ్చే కత్రినా కైఫ్ టవల్ ఫైట్ టైగర్‌ 3 సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే ఈ ఫైట్‌ కోసం తానెంతగానో కష్టపడ్డానంటోంది క్యాట్. దీనికి సంబందించిన వీడియోను తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిందీ టాలీవుడ్ మల్లీశ్వరి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి సినిమాలో హీరోలు ఫైట్ చేస్తుంటారు. అయితే ప్రతిసారీ వారికి మళ్లీ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అది బాగా అలవాటు. కానీ హీరోయిన్లకు ఫైట్‌ చేసే అవకాశం చాలా తక్కువ. అందుకు తగ్గట్టుగా వారు శిక్షణ పొందాలి. ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాల సక్సెస్ తర్వాత ‘టైగర్ 3’ వస్తుండటంతో జనాలు చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగా యాక్షన్ సీన్స్ రావాల్సి ఉంది. అందుకోసం కత్రినా కైఫ్ చాలా కష్టపడింది.

‘టైగర్ 3’ సినిమాలో జోయా పాత్ర కోసం కత్రినా కైఫ్ చాలా రోజులుగా కష్టపడింది. హీరోలకు సమానంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లో శిక్షణ తీసుకుంది. ఆమె తెరవెనుక ఎంత కష్టపడుతున్నారో చెప్పడానికి ఈ వీడియోలే నిదర్శనం. మరి క్యాట్‌ కష్టానికి అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. దీపావళి కానుకగా నవంబర్ 12న ‘టైగర్ 3’ సినిమా విడుదల కానుంది. ముంబైలో ఉదయం 6 గంటలకు షో ప్రారంభం కానుంది. ఇప్పటికే షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలు ఈ ఫీట్ సాధించడంతో బాలీవుడ్ హీరోలకు కొత్త టార్గెట్ ఫిక్స్ అయింది. మనీష్‌ శర్మ టైగర్‌ 3 సినిమాను తెరకెక్కించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ కూడా ఇందులో ఓ క్యామియో రోల్‌ పోషించనున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కత్రికా కైఫ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.