మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్(jacqueline fernandez)కు కష్టాలు మరింత పెరిగాయి. ఢిల్లీ పోలీసుల ఆర్ధిక నేరాల విభాగం, ఈడీ విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. తనకు జీవిత భాగస్వామి లభించాడని , ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోబుతున్నట్టు జాక్వెలిన్ తన ఫ్రెండ్స్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ భాగస్వామి ఎవరో కాదని తీహార్ జైల్లో ఉన్న మాయగాడు సుకేశ్ చంద్రశేఖర్ అని దర్యాప్తులో తేలింది. రూ. 200 కోట్ల వసూళ్ల కేసులో అరెస్టయిన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ కోట్ల రూపాయల విలువైన బహుమతులు తీసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో పాటు ఢిల్లీ పోలీసుల ఆర్ధిక విభాగం కూడా చాలా గంటల పాటు జాక్వెలిన్‌ను విచారించింది. ఖరీదైన కార్లతో పాటు విలువైన నగలను జాక్వెలిన్‌కు సుకేశ్ బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. జ మాయగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు జాక్వెలిన్‌ను పరిచయం చేసిన పింకీ ఇరానీని కూడా ఈడీ లోతుగా విచారించింది.
జాక్వెలిన్‌ను , పింకీ ఇరానీని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించారు. సుకేశ్‌ను పెళ్లి చేసుకుంటే లైఫ్ చాలా బాగుటుందని జాక్వెలిన్‌ను ట్రాప్ చేసినట్టు చెబుతున్నారు. రూ.200 కోట్ల బెదిరింపు కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నమోదు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో జాక్వెలిన్ పేరును చేర్చారు. ఆర్థిక నేరస్థుడు సుకేశ్ చంద్ర శేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన గిఫ్ట్‌లు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మనీలాడరింగ్ కేసులో జాక్వెలిన్‌ను గతంలో కూడా ఈడీ విచారించింది. ఇప్పటికే జాక్వెలిన్‌కు చెందిన 7 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. అయితే ఈడీ అటాచ్ చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు తన కష్టార్జితమని జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పష్టం చేశారు. రూ. 200 కోట్ల కుంభకోణంలో మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్ ఇచ్చిన బహుమతులు కాదని ఆమె వెల్లడించారు. తన సంపాదనకు సంబంధించి ఆదాయపు పన్ను కూడా చెల్లించానని, క్రైమ్ ప్రొసీడింగ్స్‌ను నిలిపి వేయాలని ఈడీని కోరారు. మాయగాడు సుకేశ్‌తో పరిచయం లేనప్పుడే, ఎఫ్‌డీలపై పన్ను చెల్లించినట్లు ఈడీకి ఇచ్చిన సమాధానంలో జాక్వెలిన్ తెలిపారు. అదంతా తన సొంత సంపాదన అని అంటున్నారు జాక్వెలిన్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.