Jacqueline Fernandez : ఎట్టకేలకు ఈడీ ముందు హాజరైన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్..

బాలీవుడ్‌లో రోజుకో రచ్చ జరుగుతుంది. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంతో సతమతం అవుతున్న హిందీ ఇండస్ట్రీలో ఇప్పుడు మరో కలకలం రేగింది.

Jacqueline Fernandez : ఎట్టకేలకు ఈడీ ముందు హాజరైన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్..
Jacqueline
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Oct 20, 2021 | 7:41 PM

Money laundering : బాలీవుడ్‌లో రోజుకో రచ్చ జరుగుతుంది. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంతో సతమతం అవుతున్న హిందీ ఇండస్ట్రీలో ఇప్పుడు మరో వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడింది. మనీ లాండరింగ్ కేసులో జాక్వలిన్‌కు నోటీసులు పంపారు ఈడీ అధికారులు. విచారణకు హాజరు కావాలని సూచించినప్పటికీ ఈ భామ దాన్ని లైట్ తీసుకుంది. ఇప్పటివరకు నాలుగు సార్లు విచారణకు డుమ్మా కొట్టింది జాక్వలిన్.  ఈ కేసులో జాక్వెలిన్ నాలుగోసారి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు హాజరు కాలేదు. గతంలో మూడు సార్లు కూడా హాజరుకాని జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. తాజాగా సోమవారం కూడా విచారణకు హాజరుకాలేదు. ఇదిలా ఉంటే నేడు (బుధవారం ) ఎట్టకేలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు జాక్వలిన్ హాజరయ్యింది. సుఖేష్ చంద్ర శేఖర్‌తో ఉన్న సంబంధాలపై జాక్వలిన్‌ను విచారించారు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.

ఇక సుఖేష్ చంద్రశేఖర్ పై 200కోట్ల కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. సుఖేష్‌ చంద్రశేఖర్‌, ఆయన భార్య లీనా పౌల్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే బాలీవుడ్ నటి నోరాఫతేహి, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఈడీ.. ఆమె వాంగ్మూలాన్ని ఆగస్టు 30వ తేదీన నమోదు చేసుకుంది. నాటి నుంచి ఫెర్నాండెజ్ విచారణకు హాజరుకావడం లేదు. ఈ మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే సుఖేష్‌ చంద్రశేఖర్‌, లీనా పౌలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ వ్యాపార వేత్త శివేందర్‌ సింగ్‌ భార్య అథితి సింగ్‌ ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నోరా ఫాతేహిను కూడా అధికారులు ప్రశ్నించి.. వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh: ఇక పై అలాంటి సినిమాలు చేయనంటున్న ముద్దుగుమ్మ.. సంచలన నిర్ణయం తీసుకున్న కీర్తిసురేష్..

BiggBoss 5 Telugu : వార్‌కు దిగిన సన్నీ- ప్రియా.. ‘చెంప పగిలిద్ది అంటూ.. దమ్ముంటే కొట్టి చూడు అంటూ’.. రెచ్చిపోయిన కంటెస్టెంట్స్..

Aryan Khan: షారుఖ్‌కు మరో షాక్ .. ఆర్యన్ ఖాన్‌‌కు దొరకని బెయిల్.. నిరాశలో అభిమానులు..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..