Katrina Kaif :ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రగ్నెంట్ అయ్యిందా..? వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో నెటిజన్లు ఎక్కువగా సినిమా తరాలపైనే ఫోకస్ పెడుతుంటారు. వారికీ సంబంధించి ఏ చిన్న విషయం తెలిసిన అది క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.

Katrina Kaif :ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రగ్నెంట్ అయ్యిందా..? వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు
Katrina Kaif
Follow us
Rajeev Rayala

| Edited By: Basha Shek

Updated on: Apr 12, 2022 | 4:33 PM

సోషల్ మీడియాలో నెటిజన్లు ఎక్కువగా సినిమా తరాలపైనే ఫోకస్ పెడుతుంటారు. వారికీ సంబంధించి ఏ చిన్న విషయం తెలిసిన అది క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ గురించి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ అమ్మడు ఎవరంటే బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్(Katrina Kaif ). రీసెంట్ గా పెళ్లిచేసుకొని కొత్తజీవితాన్ని ప్రారంభించింది ఈ అమ్మడు. బాలీవుడ్ కుర్ర హీరో విక్కీ కౌశల్(Vicky kaushal)ను ప్రేమించి పెళ్లాడింది కత్రినా. కొత్తజీవితాన్ని ఆస్వాదిస్తున్న కత్రినా మరో పక్క నెమ్మదిగా సినిమాలపైనా దృష్టిపెట్టింది. కరోనా ప్రభావంతో కొన్ని రోజులుగా చిత్రీకరణలు ఆగిపోయాయి. ఇప్పుడు షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కత్రినా ప్రెగ్నెట్ అంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా కత్రినా కైఫ్ ముంబై ఎయిర్ పోర్ట్ లో మీడియా కంట పడింది.

కత్రినా ను చూసిన మీడియా తమ కెమెరాలకు పని చెప్పారు. కత్రినా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో కత్రినా మునుపటిలా కనిపించలేదు. దాంతో కత్రినా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈవీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. త్వరలోనే కత్రినా తల్లికాబోతుందని కొందరు.. నిజంగానే ఆమె ప్రగ్నెంట్ అయ్యిందా ..? లేక ఆ డ్రస్ వల్ల అలా కనిపిస్తుందా అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. కత్రినా కానీ విక్కీ కానీ స్పందిస్తేనే ఈ విషయం పై క్లారిటీ వస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lata Mangeshkar Award: ప్రధానిని వరించిన తొలి ‘లతా దీనానాథ్‌ మంగేష్కర్‌’ అవార్డు..

Rajamouli: జక్కన్నకు ఘన స్వాగతం పలికిన ఆదివాసీలు.. గాలిబుడగల థియేటర్లో ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన రాజమౌళి..

KGF 2 Movie: తన వల్లే మీ ముందు ఇలా ఉన్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన రాకింగ్ స్టార్ యశ్..