AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hrithik Roshan: స్టార్ హీరో ఇంట తీవ్ర విషాదం.. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన హృతిక్ అమ్మమ్మ..

Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఇంట విషాదం చోటు చేసుకుంది. హృతిక్ అమ్మమ్మ, పద్మా రాణి ఓంప్రకాష్ (91) ముంబైలో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స...

Hrithik Roshan: స్టార్ హీరో ఇంట తీవ్ర విషాదం..  అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన హృతిక్ అమ్మమ్మ..
Hrithik Roshan
Basha Shek
|

Updated on: Jun 18, 2022 | 2:02 PM

Share

Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఇంట విషాదం చోటు చేసుకుంది. హృతిక్ అమ్మమ్మ, పద్మా రాణి ఓంప్రకాష్ (91) ముంబైలో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. అయితే కోలుకోలేక శుక్రవారం తుదిశ్వాస విడిచారామె. వయసు సంబంధిత సమస్యలకు తోడు తీవ్ర అనారోగ్యంతో పద్మారాణి గత కొన్నేళ్లుగా హృతిక్‌ తల్లి పింకీ రోషన్‌ దగ్గరే ఉంటోంది. కాగా దివంగత ఫిల్మ్ మేకర్ జే ఓం ప్రకాష్ భార్యే పద్మా రాణి. ఈ దంపతుల కుమార్తెనే పింకీ రోషన్. జే ఓం ప్రకాష్ఆప్ కీ కసమ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో రాజేష్ ఖన్నా హీరోగా నటించారు. ఈ మూవీ 1974లో విడుదలైంది. ఆతర్వాత హీరో జితేంద్రతో కలసి ఓం అనేక చిత్రాల్లో పనిచేశారు. ఆషా , అర్పన్, ఆద్మీ ఖిలోనా హై, ఆయీ మిలన్ కి బేలా, ఆస్ కా పంచీ, ఆయే దిన్ బహర్ కే , ఆంఖోన్ ఆంఖోన్ మే, అయా సావన్ ఝూమ్ కే వంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాలను కూడా నిర్మించారు.

ప్రముఖుల సంతాపం..

ఇవి కూడా చదవండి

జే ఓంప్రకాష్ 93 ఏళ్ల వయసులో ఆగస్టు 7, 2019న మరణించారు. ఇప్పుడు ఆయన సతీమణి కూడా కన్నుమూశారు. కాగా పద్మారాణి మరణాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది పింకీ రోషన్‌.. ‘నా తల్లి పద్మా రాణి ఓంప్రకాష్ నా తండ్రిని కలవడానికి ఈ లోకం నుంచి విడిచి వెళ్లిపోయింది’ ఎమోషనల్‌ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. దీంతో పలువురు ప్రముఖులు హృతిక్‌ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!