Suhani Bhatnagar Death: ‘నువ్వు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్‌’.. ‘దంగల్‌’ నటి హఠాన్మరణంపై ఆమిర్‌ ఖాన్

ఆమిర్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం దంగల్ లో చిన్నారి బబితా కుమారి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహానీ భట్నాగర్ ఇక లేరు. ఫరీదాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె హఠాన్మరణం చెందింది. కేవలం 19 ఏళ్ల వయసులో సుహాని చనిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. సుహాని మరణంపై బాలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Suhani Bhatnagar Death: నువ్వు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్‌.. దంగల్‌ నటి హఠాన్మరణంపై ఆమిర్‌ ఖాన్
Suhani Bhatnagar's Demise

Updated on: Feb 17, 2024 | 6:29 PM

ఆమిర్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం దంగల్ లో చిన్నారి బబితా కుమారి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహానీ భట్నాగర్ ఇక లేరు. ఫరీదాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె హఠాన్మరణం చెందింది. కేవలం 19 ఏళ్ల వయసులో సుహాని చనిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. సుహాని మరణంపై బాలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆమె హఠాన్మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే సుహానీ మరణంపై దంగల్‌ హీరో ఆమీర్‌ ఖాన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమీర్ ఖాన్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ ట్విట్టర్‌ వేదికగా సుహానికి నివాళులు అర్పించింది. “సుహాని మరణ వార్త విని మేం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. అతని తల్లి పూజా జీ, ఇతర కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. సుహాని చాలా ప్రతిభావంతులైన యువతి. ఆమె లేకుంటే దంగల్ అసంపూర్ణంగా ఉండేది. సుహానీ, నువ్వు మా గుండెల్లో ఎప్పుడూ ఉంటావు. నీ ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ దంగల్‌ నటికి నివాళులు అర్పించింది ఆమిర్‌ ఖాన్‌ టీమ్‌.

సుహానీ భట్నాగర్ వయస్సు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. కొద్దిరోజుల క్రితం ఆమెకు యాక్సిడెంట్ అయ్యిందని, అందులో కాలు ఫ్రాక్చర్ అయిందని రిపోర్టుల్లో చెబుతున్నారు. ఫ్రాక్చర్ చికిత్స సమయంలో ఆమె మందులు తీసుకుంది. అయితే ఇవి తీవ్ర దుష్ప్రభావం చూపించడం వల్ల సుహాని తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ కారణంగానే గత కొన్ని రోజులుగా ఫరీదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుందామె. అయితే శనివారం (ఫిబ్రవరి 17) పరిస్థితి విషమించి ఈ లోకం నుంచి వెళ్లిపోయింది సుహాని.
సుహాని చాలా కాలంగా సోషల్‌ మీడియాకు కూడా దూరంగా ఉంటోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆఖరి పోస్ట్‌ నవంబర్‌ 21న ఉంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు దాదాపు 23 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిలో దంగల్‌లో కలిసి పనిచేసిన సన్యా మల్హోత్రా మరియు ఫాతిమా సనా షేక్ తదితరులు ఉన్నారు..

ఇవి కూడా చదవండి

ఆమిర్ ఖాన్ ట్వీట్..

 

అభిమానుల నివాళులు..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.