TOP9 ET: ఆ విషయంలో తండ్రో వైపు.. కొడుకో వైపు.! | బాబాయ్ vs అబ్బాయి ఇక బస్తీ మే సవాల్.
ఎడమొహం పెడమొహంగా ఉంటున్న బాబాయ్ అబ్బాయి.. ఇప్పుడు నేరుగా బస్తీ మే సవాల్ అనే స్థాయికి చేరుకున్నారు. తమ సినిమాలతో దసరా బాక్సాఫీస్ బరిలో దిగడమే కాదు.. బాక్సాఫీస్ ముందు బిగ్ ఫైట్ ఉంటుందనే హింట్ ఇచ్చారు. ఎందుకంటే దేవర టీం తమ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే దాదాపుగా ఆ డేట్‌కు దగ్గర్లోనే బాబీ- బాలయ్య సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
01.chiru – ram charan: ఆ విషయంలో తండ్రో వైపు… కొడుకో వైపు… (చరణ్, చిరు)
హిందీ సినిమాలు చేయాలంటే లాంగ్వేజే అడ్డంకని అప్పుడెప్పుడో 90స్‌లోనే మెగాస్టార్ చిరు చెప్పారు. ఒకటీ అరా తప్ప మరే డైరెక్ట్ హిందీ సినిమాను చేయకుండా తెలుగు సినిమాలకే ఫిక్స్ అయిపోయాడు. కాని చిరు కొడుకు చెర్రీ మాత్రం అటు వైపే అడుగులు వేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ రీచ్‌తో… నేరుగా బాలీవుడ్ డైరెక్టర్స్ సినిమాల్లోనే హీరోగా సైన్ చేస్తున్నాడు. రీసెంట్‌గా సంజయ్‌లీలా భన్సాలీ సినిమాకు ఓకే చెప్పాడు. తనకేం లాంగ్వేజ్ బారియర్ లేదని.. స్టోరీ నచ్చితే.. ఎగ్జైట్ చేస్తే ఏ సినిమా అయినా చేయడానికి రెడీ అని హింట్ ఇచ్చాడు.
02.Balayya – ntr: ఇక బస్తీ మే సవాల్…
ఎడమొహం పెడమొహంగా ఉంటున్న బాబాయ్ అబ్బాయి.. ఇప్పుడు నేరుగా బస్తీ మే సవాల్ అనే స్థాయికి చేరుకున్నారు. తమ సినిమాలతో దసరా బాక్సాఫీస్ బరిలో దిగడమే కాదు.. బాక్సాఫీస్ ముందు బిగ్ ఫైట్ ఉంటుందనే హింట్ ఇచ్చారు. ఎందుకంటే దేవర టీం తమ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే దాదాపుగా ఆ డేట్‌కు దగ్గర్లోనే బాబీ- బాలయ్య సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
03.allu arjun: పుష్ప3 ఉండొచ్చు.. అసలు విషయం చెప్పేసిన బన్నీ
పుష్ప రైజ్.. పుష్ప రూల్.. మాత్రమే కాదు పుష్ప రోర్ కూడా ఉంటుందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓటాక్ నడుస్తోంది. అయితే ఈ టాన్ నిజమనే కన్ఫర్మేషన్ తాజాగా అల్లు అర్జున్ నుంచి వచ్చింది. బెర్లిన్‌లో జరుగుతున్న 74 ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆఇండియా తరపున గెస్ట్ గా వెళ్లిన అల్లు అర్జున్.. అక్కడి ఓ మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప3 కూడా ఉండొచ్చంటూ చెప్పారు. పుష్ప సినిమాను ఓ ఫ్రాంచైజ్‌లా మార్చాలనే ఆలోచన ఉందన్నారు.
04. mahesh: 100 మిలియన్ల.. కుర్చీ మడతపెట్టి సాంగ్
మహేష్ గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తూనే ఉంది. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటూనే తాజాగా 100 మిలియన్ వ్యూస్ సాధించింది యూట్యూబ్‌లో. అయితే అది వీడియో సాంగ్‌కు కాదు.. సర్‌ప్రైజింగ్‌లీ లిరికల్ సాంగ్‌కు.
05. sai pallavi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాయి పల్లవి సరదా రీల్
సాయి పల్లవి అక్రాస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఒక్కతే కాదు అక్కనేని నాగచైతన్యతో కలిసి. ఎస్ ! రీసెంట్‌గా వ్యాలెంటైన్స్ డే సందర్భంగా తమ మూవీ తండేల్ ప్రమోషన్ కోసం వీరిద్దరూ చేసిన రీల్ ఇప్పుడు రికార్డులు బద్దలు కొడుతోంది. అక్రాస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లలో 20 మిలియన్ వ్యూస్ వచ్చేలాచేసకుంది. అంతేకాదు చై, సాయి పల్లవి ఇన్‌స్టా అకౌంట్స్‌లలో మోస్ట్ వ్యూవ్డ్ రీల్ కూడా ఇదే.!
06.Poja hegde: దెబ్బ మీద దెబ్బ… కలిసిరాని కాలం
హిట్ల కంటే ఎక్కువ ఫ్లాప్‌లు.. ఆ తరువాత గాయాలు. ఇప్పుడేమో ఆఫర్ల కోసం ఎదురు చూపులు..! ఇలానే సాగుతోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఫిల్మ్ కెరీర్. బిగ్ హీరోస్‌తో.. బిగ్ సినిమాల్లో ఇప్పటి వరకు యాక్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మంచి ఫిల్మ్ ఆఫర్ కోసం ఎదురుచూస్తోంది. తన కెరీర్లో వచ్చిన గ్యాబ్‌ను మంచి హిట్ కొట్టి ఫిల్ చేయాలని చూస్తోంది.
07. akhil: ఎగురుతున్న విమానంలో హీరో డ్యాన్సులు..
రీసెంట్ డేస్లో విమానాల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి సంఘటనే టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ కంటపడింది. ఆస్ట్రేలియాలో ఓ ప్లైట్ ఎక్కిన నిఖిల్.. ఆ విమానం గాల్లో ఉండగానే.. ఫ్లైట్లో ఉన్న వాళ్లందరూ టేలర్ స్విప్ట్ పాటకు డ్యాన్స్ చేయడం మన హీరోను షాక్ అయ్యేలా చేసింది. ఇక అదే షాకింగ్ ఎక్స్‌ప్రెషన్‌తో వాళ్లతో పాటు తాను కూడా డ్యాన్స్ చేసిన నిఖిల్..ఆ వీడియోను తన ట్విట్టర్ ఎక్స్‌లో షేర్ చేశాడు.
08. sidharth: ఓయ్ థియేటర్లలోకి హీరో సిద్ధార్థ్ సడెన్ ఎంట్రీ
ఫిబ్రవరి 14th లవర్స్‌డే సందర్భంగా రీ-రిలీజ్ అయిన ఓయ్ మూవీ.. ఇప్పటికీ సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. దీంతో రీసెంట్‌గా ఓయ్ మూవీ ఆడుతున్న హైద్రాబాద్లోని శాంతి థియేటర్లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చాడు ఈ హీరో. సినిమా చూసేందుకు వచ్చిన వారిని పలకరించి.. వారితో కలిసి ఈ సినిమాలోని ఓ పాటను కూడా పాడాడు. ఇప్పుడు ఆ వీడియోతో నెట్టింట ట్రెండ్ కూడా అవుతున్నారు సిద్ధర్థ్.
09. Rakul: మొదలైన రకుల్ పెళ్లి వేడుక
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ పెళ్లి వేడుక మొదలైంది. తన లవర్.. బాలీవుడ్ హీరో కమ్ ప్రొడ్యూసర్‌ను జాకీ భగ్నానితో పెళ్లికి రెడీ అయిన ఈ బ్యూటీ.. అందుకు సంబంధించిన కార్యక్రమాల్లో.. తన ఫ్యామిలో పాటు పాల్గొంది. జాకీ భగ్నానీ ఇంట్లో మొదలైన పెళ్లి వేడుకల్లో సెంట్రాఫ్ అట్రాక్షన్ అయింది. ఆ వీడియోలతో నెట్టింట వైలర్ కూడా అవుతోంది. అన్నట్టు రకుల్ – జాకీ పెళ్లి ఫిబ్రవరి 21న గోవాలో జరగనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..