Sania Mirza: సానియా మీర్జాకు బడా హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ ఆఫర్.. కానీ
షోయబ్ మాలిక్ మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే సానియా తన కెరీర్, కొడుకుపై దృష్టి పెడుతోంది. సానియా తన టెన్నిస్ ప్రతిభ ద్వారా దేశం గర్వించేలా చేసింది. కాగా సానియా మీర్జాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఆమె కపిల్ శర్మ షోలో కూడా పాల్గొని సందడి చేసింది. ఫరా ఖాన్, కరణ్ జోహార్, పరిణీతి చోప్రా , సాజిద్ ఖాన్ సహా చాలా మంది తారలు సానియాకు మంచి స్నేహితులు.

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యక్తిగతజీవితం కారణంగా ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. అటు షోయబ్ మాలిక్ మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు. అలాగే సానియా తన కెరీర్, కొడుకుపై దృష్టి పెడుతోంది. సానియా తన టెన్నిస్ ప్రతిభ ద్వారా దేశం గర్వించేలా చేసింది. కాగా సానియా మీర్జాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఆమె కపిల్ శర్మ షోలో కూడా పాల్గొని సందడి చేసింది. ఫరా ఖాన్, కరణ్ జోహార్, పరిణీతి చోప్రా, సాజిద్ ఖాన్ సహా చాలా మంది తారలు సానియాకు మంచి స్నేహితులు. సానియా మీర్జా, ఫరాచాలా క్లోజ్ ఫ్రెండ్స్. తాజాగా కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్ సీజన్‌లో ఫరా, సానియా కలిసి పాల్గొన్నారు.
ఈ షోలో వీరిద్దరూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ షోలో కరణ్ సానియాపై ప్రశంసలు కురిపిస్తూ, ఆమె పూర్తిగా ఫిల్మీ అని అన్నాడు. దానికి తాను టెన్నిస్ క్రీడాకారిణి కాకపోతే సినిమా ఇండస్ట్రీలో పని చేసేదాన్ని అని తెలిపింది సానియా. ఆమె చెప్పగానే పక్కన ఉన్న ఫరా మాట్లాడుతూ సానియా ఇప్పటివరకు చాలా పెద్ద సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్‌లను తిరస్కరించిందని తెలిపింది.
ఫరా మాటలు విని, కరణ్ చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆ ఆఫర్‌ను అంగీకరించలేదని అడిగాడు. సానియా అన్ని ఆఫర్లను సున్నితంగా తిరస్కరించిందని ఫరా నిరాశగా చెప్పింది. ఇంతలో, ఫరా సోదరుడు తన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్‌ను కూడా తనకు ఆఫర్ చేశాడని సానియా చెప్పింది. కానీ ఆ ఆఫర్ ను కూడా తిరస్కరించాను అని తెలిపింది. టెన్నిస్ ప్లేయర్ కావడం వల్ల ఇప్పుడు తనకు నటిగా లేదా గాయనిగా తెరపై కనిపించడానికి ఆసక్తి లేదు అని చెప్పుకొచ్చింది సానియా. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




