Aryan Khan Drugs Case: ఆర్యన్ అరెస్ట్ తరువాత షారుఖ్‌ని కలవడానికి వెళ్లిన సల్మాన్‌ఖాన్‌..

Aryan Khan Drugs Case: ముంబై డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను NCB అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి

Aryan Khan Drugs Case: ఆర్యన్ అరెస్ట్ తరువాత షారుఖ్‌ని కలవడానికి వెళ్లిన సల్మాన్‌ఖాన్‌..
Salman

Updated on: Oct 04, 2021 | 12:29 AM

Aryan Khan Drugs Case: ముంబై డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను NCB అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి విచారించగా ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేశారు. అతడితో పాటు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆర్యన్ ఖాన్‌ను కోర్టులో హాజరుపరచగా అతడిని ఒకరోజు ఎన్‌సీబీ కస్టడీకి పంపారు. ఈ ఘటన తర్వాత షారుఖ్ ఖాన్‌ని కలవడానికి సల్మాన్‌ఖాన్ మన్నాత్ చేరుకున్నారు.

ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత, సల్మాన్ ఖాన్ తన స్నేహితుడిని కలవడానికి వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ బంగ్లాకు చేరుకున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ఇంట్లోకి వెళ్లే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సల్లుభాయ్ తన రేంజ్ రోవర్ కారు ముందు సీటులో కూర్చుని కనిపిస్తాడు. చిత్రాలలో సల్మాన్ తన కారును లోపలికి వెళ్లేందుకు మీడియా వ్యక్తిని పక్కకు జరగాలని కోరుతాడు.

12 గంటల విచారణ
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) శనివారం సాయంత్రం ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్‌పై దాడి చేసి డ్రగ్స్ పార్టీ చేస్తున్న చాలా మందిని అరెస్టు చేసింది. అందులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ విహారయాత్రలో రేవ్ పార్టీ జరుగుతోంది. ఆర్యన్‌తో పాటు, ఎన్‌సిబి అధికారులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆర్యన్‌ను దాదాపు 12 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత అరెస్టు చేశారు. ఆర్యన్ తరఫు న్యాయవాది సతీష్ మన్షిండే సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని తెలిపారు. కోర్టు ఆర్యన్‌కి ఒక రోజు కస్టడీని మాత్రమే ఇచ్చింది.

Viral Photos: తేలు, పాము కంటే ఈ సాలీడు విషం చాలా డేంజర్.. 15 నిమిషాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తాయ్‌..

లఖింపూర్ ఖేరీ ఘటనపై స్పందించిన ప్రతి పక్షాలు.. రేపు బాధిత కుటుంబాలను పరామర్శించనున్న పలువురు నేతలు..